టీడీపీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తోంది..

సాక్ష్యాధారాలతో ఎన్నికల అధికారికి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు

ఎల్లో మీడియాలో వచ్చిన తప్పుడు సర్వేలపై చర్యలు తీసుకోవాలి

 

అమరావతి: టీడీపీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తోందంటూ  ఎన్నికల అధికారి ద్వివేదికి  సాక్ష్యాధారాలతో  వైయస్‌ఆర్‌సీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎల్లో మీడియాలో వస్తున్న పెయిడ్‌ ఆర్టికల్స్‌పై ఫిర్యాదు చేశామని వైయస్‌ఆర్‌సీపీ నేతలు నాగిరెడ్డి,గౌతంరెడ్డి తెలిపారు. ఎల్లోమీడియాలో వచ్చిన తప్పుడు సర్వేపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఓటమి భయంతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీని కట్టడి చేయకుంటే ఎన్నికల్లో ప్రశాంతత లోపిస్తుందన్నారు.

 

Back to Top