నేడు చీరాల‌లో సామాజిక సాధికార బస్సు యాత్ర 

బాప‌ట్ల‌:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర కార్యక్రమం చీరాల‌లో నిర్వ‌హించనున్నారు.  రామకృష్ణాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైయ‌స్ఆర్‌ సీపీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్‌ మాట్లాడారు. నియోజకవర్గంలో 80 శాతం అత్యధికంగా బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారే నివసిస్తుంటారని, వారి సంక్షేమం కోసం సీఎం వైయ‌స్‌ జగన్‌ అనేక కార్యక్రమాలను చేపట్టి వారి అభివృద్ధికి బాసట వేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. టీడీపీ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తే సీఎం వైయ‌స్ జగన్‌ మాత్రం బడుగు బలహీనవర్గాలకు వెన్నెముకగా నిలిచారన్నారు. అన్ని వర్గాలలోనూ నిలిచిపోయిందన్నారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సామాజిక సాధికార బస్సుయాత్రకు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సాధికార యాత్రలో బడుగుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు.  

Back to Top