వైయస్ఆర్‌సీపీ మేనిఫెస్టో  ప్రజా మేనిఫెస్టో 

తాడేప‌ల్లి: వైయస్ఆర్‌సీపీ మేనిఫెస్టో ప్ర‌జా మేనిఫెస్టో అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీతా  అభివ‌ర్ణించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి పాలనలో 5ఏళ్ళు పేదల అభివృద్దే దిశగా పధకాలు అమలయ్యాయ‌న్నారు. ఆదివారం పోతుల సునీతా మీడియాతో మాట్లాడారు.

 •  
 • వైయస్ జగన్ చెప్పింది చేస్తాడు...చేసిందే చెబుతాడనేది ప్రజలకి నమ్మకం.
 • సామాజిక న్యాయంలో bc sc st మైనారిటీలకు నిజమైన నమ్మకం వచ్చేలా చేసిన వ్యక్తి వైయస్ జగన్.
 • మా పార్టీ మేనిఫెస్టోను చంద్రబాబు మాయ ఫెస్టో  అని విమర్శించడం సరైన విధానం కాదు.
 • టిడిపి మేనిఫెస్టోను వెబ్ సైట్ లో ఉంచేందుకు ధైర్యం లేని చంద్రబాబు ప్రజలకు మేలు చేసే వైయస్ఆర్‌సీపీ
 • మేనిఫెస్టోను విమర్శించడం ఏంటి.
 • 2014లో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు ఏం అయ్యాయి.
 • చంద్రబాబు డ్వాక్రారుణమాఫీ అని మహిళలను మోసం చేసాడు.మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే.
 • రైతు రుణమాఫి అంటూ రైతులను మోసం చేశాడు.84 వేలకోట్లకుపైగా రుణమాఫి అని చెప్పి కేవలం 14 వేల కోట్ల రూపాయలు మాత్రమే చేశాడు.
 • చంద్రబాబు గ్రాఫిక్స్ తో  అమరావతి చూపిస్తాడు ,పోలవరంని ఏటిఎం లా వాడుకున్నాడు.
 • చంద్రబాబు పాలనపై అన్ని వర్గాలకి విసుగు వచ్చే తెలుగుదేసం పార్టీని చెత్తబుట్టలో పడేశారు.
 •  ప్రతిపక్ష పార్టిగా మీరు ప్రజలకి ఏం చేశారు.కరోనా సమయంలో చంద్రబాబు,పవన్ హైదరాబాద్ లో దాక్కున్నారు.
 • రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు అంటే నమ్మకం లేదు..ప్రజలని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
 •  అమ్మఒడి,వసతి దీవెన,చేదోడు అంటూ అనేక పథకాలు ఇచ్చిన వ్యక్తి వైయస్ జగన్.
 • మేనిఫెస్టో లో నాడు-నేడు అభివృద్ధి కి, అమ్మఒడికి వేసే మొత్తాలు పెంచారు.రైతు భరోసా మొత్తాలను పెంచారు.
 •  చేయూత,కాపు నేస్తం కొనసాగాగేలా మా మేనిఫెస్టో ఉంది
 • 17 మెడికల్ కాలేజ్, పోర్టులు,ఫిషింగ్ హార్భర్స్  నిర్మాణం జరుగుతుంది.
 • మధ్యవర్తులకు అవకాశం లేకుండా అవినీతికి తావులేకుండా  ప్రజల ఖాతాలో నేరుగా 2లక్షల 70వేల కోట్లు జగన్ గారి ప్రభుత్వం జమ చేసింది..
 •  మేనిఫెస్టో అంటే ఒక బైబిల్,గ్రంధం,ఖురాన్ లాంటిది.
 • చంద్రబాబు అబద్దాలు చెబితే ప్రజలు మరోసారి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు
Back to Top