చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ

కందుకూరు స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం

చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. మనది ఇంటింటికీ మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ 

ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే.. 

పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు.. 

మన పార్టీకి ఓటు వేయండని మీ బిడ్డ అడుగుతున్నాడు:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ముఖ్య‌మంత్రి ఎన్నిక‌ల ప్ర‌చారానికి జ‌న‌నీరాజ‌నం

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మోసాల బాబుకు ఓటేయ‌కండి అంటూ ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. మనది ఇంటింటికీ మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచిచేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడ‌ని సీఎం వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారు.
 తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, టీవీ5 నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా?. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబు కూటమి ఆంధ్రరాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్‌కి వెళ్లిపోతారు. చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ. నయా ఈస్టిండియా కంపెనీ చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేద‌ని సీఎం వైయ‌స్ జగన్‌ ధ్వజమెత్తారు. ఆదివారం కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మాట్లాడారు.
  

సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..:

కందుకూరు సిద్ధమా. ఈ రోజు  ఇంతటి ఎండలో కూడా, ఇంతటి అభిమానం చూపిస్తూ చెక్కు చెదరని  నమ్మకానికి, మీ ప్రేమానురాగాలకు,  అప్యాయతకు  నిండు మనసుతో.. నా  ప్రతీ అక్కకు, ప్రతీ చెల్లెమ్మకు, ప్రతీ అవ్వకు, ప్రతి తాతకు, ప్రతీ స్నేహితుడుకు, సోదరుడుకు, మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు  ముందుగుగా మీ జగన్ రెండు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు. 

*చంద్రబాబుది అబద్దాలు, మోసాల ఫ్యాక్టరీ.*
 మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఈ  ఎన్నికల్లో చంద్రబాబుది అబద్దాలు, మోసాల ఫ్యాక్టరీ అయితే, మనది ఇంటింటికి మంచి చేసి, అభివృద్ధి చేసి, ఆ పాలన చూపిస్తున్నది మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అటు చంద్రబాబు పార్టీలతో జత కడితే, మీ బిడ్డ ప్రజలకు మంచి చేసి ఆ ప్రజలతోనే పొత్తు పెట్టుకుని ధైర్యంగా మీ ఆశీస్సుల కొరకు మీ సమక్షంలో ముందుకు వచ్చాడు.  నేను ఒకటే ఒకటి ఆలోచన చేయమని మీమ్మల్ని చేయమని కోరుతున్నాను.

*రానున్న ఐదేళ్ల అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలివి.*
ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నుకునే మాత్రమే కాదు.. వచ్చే ఐదేళ్ల మీ ఇంటింటి ఐదేళ్ల అభివృద్ధిని,  ప్రతీ పేద కుటుంబం, కుటంబం భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు జ్జాపకంలో పెట్టుకోమని కోరుతున్నాను. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు.. మళ్లీ మోసపోవడమే అన్నది ప్రతీ ఒక్కరూ కూడ జ్జాపకం పెట్టుకోవాలని కోరుతున్నాను. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే బాబు  మళ్లీ మోసం చేసేందుకు  సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తున్న మేనిఫెస్టోకు ఇదే అర్థం. 

*బాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టడమే...*
చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న వాస్తవం ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను.

 ఎన్నికలు వస్తున్నాయని, ఈ మధ్య కాలంలో మనకి ఏం కనిపిస్తోంది. ఎన్నికలు వస్తున్నాయని మన రాష్టానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఓ సుమతి శతకంలో వాక్యం కనిపిస్తోంది.  తెప్పలు చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుకదరా సమతి అనేది గుర్తుకు వస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు తిరుగుతున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, ఓ ఈనాడు రామోజీ, ఏబీఎన్ రాథాకృష్ణ, టీవీ5 నాయుడు వీళ్లలో ఎవరైనా కూడా ఆంద్రప్రదేశ్ లో ఎక్కడ నివాసం ఉంటున్నారని  అడుగుతున్నాను.

*నాన్ లోకల్ కిట్టీ పార్టీలు..*
వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఓడిన వెంటనే వీళ్లంతా మళ్లీ హైదారాబాద్ కు వెళ్లిపోతారు. ఇది వీరికి మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. ఈ నాన్ లోకల్ కీట్టి పార్టీలకు, నాన్ లోకల్ కిట్టీ పార్టీల సభ్యులకు, ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు  మన రాష్ట్రం అంటే , మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు.. దోచుకునేది పంచుకునేందుకు  అన్నది ప్రతీ ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు.  మనం చేసిన మంచి చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్లలో ఏ ఒక్కరికీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీళ్లందరికీ భిన్నంగా ఐదేళ్ల పాలనలో  ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇదని, మనం చేసినది ఇదీ అని తలెత్తుకుని మీ బిడ్డకు చెబుతున్నాడు. సగర్వంగా తెలియజేస్తున్నాడు.  మీ  బిడ్డ  వల్ల  మీకు  మంచి జరిగి ఉంటే మీ మీ బిడ్డకు తోడుగా, సైనికులుగా మీరే నిలవండి అని సగర్వంగా కోరుతున్నాడు.

*చంద్రబాబు మాదిరిగా బడాయిలు చెప్పడం లేదు.*
నేను చంద్రబాబు మాదిరగా సెల్ ఫోన్  నేనే కనిపెట్టాను అంటూ బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన మీద  ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు ఉంచి  మీరే మార్కులు వేయండి  అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  మీ జగన్ కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ ప్రతీ ఒక్కరికీ, ప్రతీగ్రామం, ప్రతీ పట్టణంలోనూ కనీసం ఆరేడు వ్యవస్థలు కొత్తగా ఏర్పాటు చేసి  మీ బిడ్డ మీ అందరికీ చూపించ గలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీ వద్ద ఉన్నాయా.. లేదా అన్నది మిమ్మల్నే ఆలోచన  చేయమని మీ బిడ్డ అడుగుతున్నాడు.

*మన పాలన బాగుందనుకుంటేనే మన పార్టీకి ఓటేయండి.*
మన గ్రామంలోనే నాలుగు అడుగులు వేస్తే  ఆ గ్రామంలోనే ఓ గ్రామ వార్డు సచివాలయాలు, ఆదే గ్రామంలో 60,70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్ధ, దాదాపుగా 600 రకాల పౌర సేవలతో ఇంటింటికి వెళ్లి పౌరసేవలన్నీ కూడా డోర్ డెలివరీ చేస్తూ... చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ...  వాలంటీ వ్యవస్థ కనిపిస్తోంది. అదే గ్రామంలో మరో నాలుగు  అడుగులు ముందుకు వేస్తే ఇంగ్లీషు మీడియం చదువులతో  నాడు - నేడుతో  మారిన గవర్నమెంట్ బడి.  అదే బడిలో ఇంగ్లీషు మీడియం చదవులతో తోడుగా ఉంటున్న మార్పు. అదే గ్రామంలో ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లీనిక్ ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ప్రతి ఇంటికీ సేవలందిస్తున్నవిలేజ్ క్లినిక్ కనిపిస్తోంది. అదే గ్రామంలోనే మహిళా పోలీసు కనిపిస్తోంది. అదే గ్రామంలోనే డిజిటల్ లైబ్రరీ,  పైబర్ గ్రిడ్ వంటి వ్యవస్ధలన్నీ ఈ 58 నెలల కాలంలో, మీ బిడ్డ పాలనలో మన కళ్లెదుటనే కనిపిస్తున్నాయి. ఈ వ్యవస్ధలన్నీ ఇలాగే  కొనసాగాలంటే మన పాలన బాగుందనుకుంటే  మాకు , మన పార్టీకి ఓటు వేయండని మీ బిడ్డ అడుగుతున్నాడు.

అలాగే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఓ అమ్మఒడి అనే పథకంతో పేద పిల్లలకు తోడుగా ఉంటూ ఆ పేదవిద్యార్థుల తల్లులకు తోడుగా, అన్నగా ఉంటూ అమ్మఒడి వంటి పథకాన్ని గతంలో ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నాను. ఆ పిల్లల్ని మళ్లీ ఇలాగే చదివించాలనుకుంటే మళ్లీ మీ అన్నకు  అధికారం ఇవ్వండి అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  
 అలాగే గవర్నమెంట్ బడుల్లో మన పిల్లలు బాగా ఎదగాలని  నాడు- నేడు, ఇంగ్లీషు మీడియం తీసుకువచ్చింది ఆ పిల్లల జగన్ మామ అని సగర్వంగా తెలియజేస్తున్నాన. రాబోయే ఐదేళ్లలో మన పిల్లలు ఇలాగే ఇంగ్లిషు మీడియంలో చదువుకునే మంచి రోజులు రావాలంటే,  ఈమార్పులు కొనసాగాలంటే... మీ బిడ్డకే, ఫ్యాన్ కు ఓటు వేయండి అని  అడుగుతున్నాడు.

 అక్కచెల్లెమ్మలకు గతంలో ఎన్నడూ చూడని విధంగా అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీనేస్తం,  అక్కచెల్లమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు అందులో కడుతున్న 22 ఇళ్లు, ఫూర్తి ఫీజులు కడుతూ  విద్యా దీవెన, వసతి దీవెన ఇఅన్నీ కూడా అక్కచెల్లెమ్మల బాగోగుల కోసం, వారి కుటుంబాల బాగోగుల కోసం, వారి పిల్లల బాగోగుల కోసం గతంలో ఎన్నడూ జరగని విధంగా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అని అడుగుతున్నాను.
 నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం  ఓతోడు.. చేదోడు.. ఓ రైతు భరోసా,  నేతన్న నేస్తం. ఓ వాహన మిత్ర వంటి అనేక పథకాలు గతంలో  ఎన్నడూ జరగని విధంగా తర్వాత కూడా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు పై రెండు బటన్ లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండాలని ఈ సందర్బంగా అక్కచెల్లెమ్మలను వారి కుటుంబ సభ్యులను కోరుతున్నాను. 
ఇంటికే వచ్చే వాలంటీర్లు... మరలా వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ రూ. 3 వేలు ఇచ్చే పెన్షన్..  ఇంటి ముంగిటే వచ్చే పెన్షన్.. మీ ఆత్మగౌరవం నిలిపే ఈ మర్యాద ఇలాగే కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు పై రెండు బటన్ లు నొక్కి అండగా ఉండాలని కోరుతున్నాను.
చంద్రబాబు మార్కు దోపిడీ సామ్రాజ్యం, గ్రామ, గ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ తలెత్తకూడదంటే మీ బిడ్డకు మీరే తోడుగా ఉంటూ... ఫ్యాన్ గుర్తు పై రెండు ఓట్లు వేయాలని మీ బిడ్డ అడుగుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివక్ష లేకుండా లంచాలు లేకుండా ప్రాంతం, పార్టీలు , మతాలు లేకుండా వచ్చే ఐదేళ్లూ  కూడా ఇవన్నీ కూడా కొనసాగాలంటే  ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేసితోడుగా  ఉండాలని  ప్రతీ అక్క చెల్లెమ్మ కుటుంబాలను మీ బిడ్డ అడుగుతున్నాడు. 

  130 బటన్లు నొక్కి  అక్కచెల్లెమ్మలకు రూ. 2 . 70 లక్షల కోట్లు జమ.
  130 బటన్లు నొక్కి  రూ. 2 . 70 లక్షల కోట్లు ఎటువంటి వివక్ష లేకుండా డీబీటీగా అక్కచెల్మెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, వారి చేతికి నేరుగా వివిధ పథకాల ద్వారా వచ్చే పరిస్థితులు మళ్లీ వచ్చే ఐదుసంవత్సరాలు కొనసాగాలంటే ఫ్యాన్  గుర్తు పై రెండు బటన్లు నొక్కాలని నా ప్రతి అక్కచెల్లెమ్మ వారి కుటుంబసభ్యులను మీ బిడ్డ సవినయంగా అడుగుతున్నాడు. 

*మీ బిడ్డ పాలనలో ఇంటింటా కనిపించే అభివృద్ధి.*
మీ గ్రామంలోనే విలేజ్ క్లీనిక్, ఫ్యామిలీ డాక్టర్, మీ ఇంటికే అందిస్తున్న ఆరోగ్య సురక్ష వంటివి కొనసాగాలంటే, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్యశ్రీ ద్వారా ఏ పేదవాడు ఆరోగ్యం కోసం అప్పుల పాలు కాకూడదన్నా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కండి. ప్రతి పేదవాడికి మీ బిడ్డ తోడుగా ఉంటాడు. పేదవాడు బతుకులు మారాలంటే  మీ బిడ్డను ఆశీర్వదించండి అని కోరుతున్నాను. ఆలోచన చేయండి. మీ బిడ్డ పాలనలో.. మీ ఇంటింటా.. కనిపించే అభివృద్ధి.

*చంద్రబాబుది ఈటీవీ, ఏబియన్ లో కనిపించే గ్రాఫిక్స్ పాలన.*
మరి చంద్రబాబుది కేవలం ఈనాడు, ఈటీవీలోనూ కేవలం ఆంధ్రజ్యోతి, టీవీ5లో మాత్రమే కనిపించే గ్రాపిక్స్, చెప్పే మోసాలు, అబద్దాలు. చంద్రబాబుకు  ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్ కు ఇంత, రామోజీ రావుకు ఇంత, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత, టీవీ5  నాయుడికి ఇంత, దత్తపుత్రుడికి ఇంత, వదినమ్మకి ఇంత అని వీరందరికీ 
మనీ ట్రాన్సఫర్. జన్మభూమి కమటీలకు పేటీఎం. 

మీ ఆందరినీ సవినయంగా ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబుకు ఓటేసే డబ్బులు మీ ఇంటికి వస్తాయా లేక దత్తపుత్రుడికి, ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, వాళ్ల వదినమ్మకి ఇంత అని వాళ్లందరికీ డీబీటీగా మనీ ట్రాన్స ఫర్ గా, వాళ్లందరికీ పేటీఎంగా డబ్బులు పోతాయా లేక మీ బిడ్డ పాలన మాదిరిగా బటన్ నొక్కడం నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా ఆలోచన చేయండి. 
మీ అందరినీ ఇదే కోరుతున్నాను. డబ్బులు మీ అకౌంట్లోకి మీ చేతికే పంపితే అది మీ జగన్. అదే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి, తన జేబులోకి, తన పెత్తందారీ స్నేహితుల జేబుల్లోకి వేసుకుంటే అది బాబు పాలన.

ఇదే రాష్ట్రం...  ఇదే బడ్జెట్... అప్పులు కూడా అప్పుడు కంటే ఇప్పుడే గ్రోత్ రేటు తక్కువ. మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు. ఎప్పుడూ కనీ, వినీ ఎరుగని విధంగా స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎలా పంపించగలిగాడు అని ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈ డబ్బంతా చంద్రబాబు పాలనలో ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయమని అడుగుతున్నాను.

*మోసాల బాబుకి ఓటేయకండి.*
ఈ చంద్రబాబు నాయుడు మోసాలకు, ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా బాబుకు ఓటు వేయకండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత మోసపోయి నష్టపోకండని విజ్ఞప్తి చేస్తున్నాను. 
ఇది మీ అందరికీ గుర్తుందా.(టీడీపీ 2014 మేనిఫెస్టో చూపిస్తూ) 2014లో ఇదే పాంప్లెట్ ను చంద్రబాబునాయుడు ప్రతి ఇంటికీ పంపించాడు. అదే పాంప్లెట్ను స్వయంగా సంతకం పెట్టి, ముఖ్యమైన హామీలు అని చెబుతూ, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీగారి ఫొటోతో, ఇదే కూటమి, ముగ్గురూ ఒకటై ఈ పాంప్లెట్ మీ ఇంటింటికీ పంపించారు. 2014లో మీ ఇంటికి పంపించిన పాంప్లెట్‌లోని ముఖ్యమైన హామీలంటూ మిమ్నల్ని మోసం చేసేందుకు ప్రతి ఇంటికీ పంపించడమే కాకుండా అప్పట్లో....   ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లో అడ్వర్టైజ్‌మెంట్స్ అన్నీ గుర్తున్నాయా?
ఒక అక్కచెల్లెమ్మను చూపించేవారు. మెడలో మంగళసూత్రం లాగుతూ ఒక చేయి వచ్చేది. వెంటనే ఆ చేయిన ఆపుతూ మరో చేయి వచ్చేది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటూ అడ్వర్జైజ్ మెంట్లు. గుర్తున్నాయా అక్కా, గుర్తున్నాయా తమ్ముడూ ఆ అడ్వర్టైజ్ మెంట్లు.
మరి 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికీ పంపించిన ముఖ్యమైన హామీలు చదవమంటారా?

Cm Jagan Speech In Kandukur Public Meeting
*చంద్రబాబు విఫల హామీలు.*
రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. మరి రూ.87,612 రైతు రుణాల మాఫీ చేశాడా ? 
మరో ముఖ్యమైన హామీ... పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ జరిగిందా?
మరో ముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్ లోనూ రూ.25వేలు డిపాజిట్ చేస్తాను అన్నాడు. ఒక్కరూపాయి అయినా డిపాజిట్ చేసాడా? అని అడుగుతున్నాను.

ముఖ్యమైన హామీ అంటూ.... ఇంటింటికీ ఓ ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి అన్నాడు. ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలల్లో రూ.1,20,000 నిరుద్యోగ భృతి ఇచ్చాడా?  మరో ముఖ్యమైన హామీ... అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు  అన్నాడు...  మూడు సెంట్ల కథ దేవుడెరుగు కనీసం ఒక్కరికన్నా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?

పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాను, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానన్నాడు. 
సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తాను అన్నాడు చేసాడా? ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తా అన్నాడు... మీ కందుకూరులో కనిపిస్తోందా?

నేను మిమ్నల్నిందరికీ ఒక్కటే ఒకటి అడుగుతున్నాను. ఆలోచన చేయమని అడుగుతున్నాను.  2014 లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతున్నాను. 
పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? మరలా వీళ్లే కూటని ఏర్పడి... ఇదే చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ అంటున్నాడు. సూపర్ సెవెన్ అంటున్నారు. ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా... ఇంటింటికీ కేజీ బంగారం కొనిస్తామంటున్నారు. నమ్ముతారా
ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి మోసాలు, అబద్దాలతో మనం ఈ రోజు యుద్ధం చేస్తున్నాం. ఈ విషయాలన్నీ గమనించమని కోరుతున్నాను. మీ అందరికీ మరలా చెబుతున్నాను. వాలంటీర్ మరలా మీ ఇంటికే రావాలన్నా... పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్ని కొనసాగాలన్నా, ఆ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆసుపత్రులు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కడానికి మీరంతా సిద్ధమేనా?
175కు 175 అసంబ్లీ స్ధానాలు, 25కి 25 ఎంపీ స్ధానాలు తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా? 
ఇంకా ఇక్కడో, అక్కడో ఎక్కడైనా మన గుర్తు తెలియకపోతే... మనది ఫ్యాను గుర్తు. మన గుర్తు ఫ్యాను అక్క. మంచి చేసిన ఈ ఫ్యాను 
మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌ లో ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్ని గుర్తుపెట్టుకుని, మన అభ్యర్ధులకు మీ చల్లని దీవెనలు ఇచ్చి ఆశీర్వదించడంతోపాటు ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి అని చెబుతూ సీఎం శ్రీ  వైయస్‌.జగన్ తన ప్రసంగం ముగించారు. 

కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్ది బి మధుసూధన్, నెల్లూరు ఎంపీ అభ్యర్ధి  విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

Back to Top