పోలింగ్‌ రోజు రిగ్గింగ్‌ను అడ్డుకోవాలి

 తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నిరసన 

తిరుపతి: పోలింగ్‌ రోజు రిగ్గింగ్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేషన్‌ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. నామినేషన్ల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరిగిన నేపథ్యంలో, పోలింగ్‌ రోజు కూడా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులు, ఎన్నికల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ నిరసనలో వైయ‌స్ఆర్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వాసుదేవ యాదవ్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులు, తిరుపతి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి పాల్గొన్నారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.
 

Back to Top