వైయస్‌ జగన్‌ను సీఎం చేయడమే వైయస్‌ఆర్‌కు నిజమైన నివాళి..

వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి రమణ

శ్రీకాకుళం:దివంగత వైయస్‌ఆర్‌ ప్రజాస్థానం..షర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానం..వైయస్‌ జగన్‌  ప్రజా సంకల్పయాత్రలు చారిత్రత్మాకమైనవని వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు.  ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఏపీ రాజకీయ చ్రరితలోనే కొత్త ఒరబడి తీసుకొచ్చారన్నారు.వైయస్‌ జగన్‌తో మరల వైయస్‌ఆర్‌  స్వర్ణయుగం రాబోతుందన్నారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలు  నూతన ఉత్తేజంతో ఉన్నారని,  సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రజలందరూ వైయస్‌ జగన్‌ కోసం ఎదరుచూస్తున్నారన్నారు.

నేడు పాదయాత్ర ముగింపు శుభ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. అలుపెరగని పోరాట యోధులుగా కష్టపడి పనిచేసారన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి పీఠం కూర్చోపెడితేనే వైయస్‌ఆర్‌కు నిజమైన నివాళి అని తెలిపారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top