ఓటీఎస్‌ పథకంపై టీడీపీ దుష్ప్రచారం

ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

విజయవాడ: జగనన్న శాశ్వత సంపూర్ణ గృహ హక్కు(వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీమ్‌)పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. . క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా విజయవాడ రామకృష్ణాపురంలో ఎమ్మెల్యే డస్ట్‌బిన్లను పంపిణీ చేశారు. ప్రజలకు ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
 

Back to Top