ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి చంద్ర‌బాబు అడ్డు

ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ‌

విశాఖ‌: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి అడ్డుప‌డుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ విమ‌ర్శించారు. గోదావ‌రి వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతుంటే చంద్ర‌బాబుకు మాత్రం రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా అని ధ్వ‌జ‌మెత్తారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ప్ర‌తి నెల 1వ తేదీనే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పింఛ‌న్లు అందిస్తున్నార‌ని చెప్పారు. నిర్మాణాత్మ‌క వ్య‌వ‌స్థ‌ను తీసుకురావాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిపారు. సంక్షేమ ప‌థ‌కాల కోసం కోట్లాది రూపాయ‌లు వెచ్చిస్తున్నార‌ని పేర్కొన్నారు. కావాల‌నే విప‌క్షాలు బుర‌ద జ‌ల్లుతున్నాయ‌ని మండిప‌డ్డారు. 30 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తే చంద్ర‌బాబు అడ్డుకుంటున్నార‌ని ఫైర్ అయ్యారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top