కాళీపట్నం రామారావు కుటుంబానికి ధర్మాన ప్రసాదరావు ప‌రామ‌ర్శ‌

 శ్రీకాకుళం:  కథా నిలయం వ్యవస్థాపకులు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు కుటుంబ స‌భ్యుల‌ను వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మంగ‌ళ‌వారం ప‌రామ‌ర్శించారు.  శ్రీకాకుళంలోని త‌న స్వగృహంలో గత శుక్రవారం రామారావు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మాన ప్ర‌సాద‌రావు  వారి ఇంటికి వెళ్లి  తొలుత కారా మాస్టారు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని ధర్మాన గుర్తు చేశారు. రామారావు కుటుంబానికి అండగా ఉంటానని ధ‌ర్మాన  హామీ ఇచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top