ఒక పార్టీకి మేలు చేయాలనే వాయిదా వేశారు

కరోనా సాకు చూపి ఎన్నికలు వాయిదా వేశారు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

తాడేపల్లి: ఒక పార్టీకి, ఒక వర్గానికి మేలు చేసేందుకు ఎన్నికల కమిషనర్‌ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ చౌదరి పని కట్టుకొని, కావాలనే ఉద్దేశ్యంతోనే ఎన్నికలు వాయిదా వేశారు. ఒక పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌ చేసిందని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. ఎవరిని సంప్రదించకుండా ఈసీ ఎలా నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఇవేవి చేయకుండా ఒక పార్టీకి మేలు చేయాలని ఎన్నికలు వాయిదా వేశారు. 

Back to Top