వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి

కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్‌

అనంత‌పురం: వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాల‌ని మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ పిలుపునిచ్చారు. గురువారం పరిగి మండల వ్యాప్తంగా పలు పంచాయతీలలో కార్య‌క‌ర్త‌ల‌తో మంత్రి సమావేశాలు నిర్వహించారు. 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలలో మన వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేస్తూ  సైనికులుగా పనిచేద్దామ‌న్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం అని కోరారు.

Back to Top