ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌

 ఓడిపోతామని భయపడి చంద్రబాబు ఎన్నికలు పెట్టలేదు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

అమరావతి: ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  ఓడిపోతామని భయపడి చంద్రబాబు పరిషత్‌ ఎన్నికలు పెట్టలేదని మంత్రి అన్నారు. జడ్పిటీసీ, ఎంపీటీసీ ఫలితాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలనుసారంగా కౌంటింగ్‌ను ఎన్నికల కమిషన్‌ నిర్ణయిస్తుందని చెప్పారు. గతంలో చంద్రబాబు ఈ ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top