స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌తో ప్ర‌జ‌ల‌కు పాల‌న మ‌రింత చేరువ‌

నూత‌న స‌చివాల‌య భ‌వ‌నాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స‌

విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌తో ప్ర‌జ‌ల‌కు పాల‌న మ‌రింత చేరువైంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. గ‌డ‌ప వ‌ద్ద‌కే సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం వేపాడ మండలం వల్లంపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన‌ సచివాలయ భవనాన్ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రారంభించారు. అనంత‌రం గ్రామంలో జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొని ల‌బ్ధిదారుల‌కు వివిధ ర‌కాల స‌ర్టిఫికెట్లు అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్  మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఎస్ కోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘు రాజు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎంపీపీ దగ్గు సత్యవంతుడు, జడ్పిటిసి సేనాపతి అప్పారావు, తదిత‌రులు పాల్గొన్నారు.

Back to Top