పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం

మంత్రి అవంతి శ్రీనివాస్‌  

విశాఖ:  పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ సమీక్ష నిర్వహించారు. సచివాలయాలు, ఆర్‌బీకేల నిర్మాణాలకు త్వరలో బిల్లులు మంజూరు చేస్తామన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయం కల్పిస్తామన్నారు.  అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top