టీడీపీ దుష్ఫ్రచారాన్ని ప్రజలు నమ్మరు..

వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు..

విజయవాడ:వైయస్‌ జగన్,కేటీఆర్‌ భేటీపై చంద్రబాబు,ఎల్లోమీడియా దుష్ఫ్రచారం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.æఆర్‌ఎస్,వైయస్‌ఆర్‌సీపీ కలిసి ఆంధ్రరాష్ట్రంలో పొత్తు పొడిచిందని అసత్య ప్రచారాన్ని ఖండించారు.దుష్ఫ్రచారాన్ని ప్రజలు నమ్మరని, అమాయకులు కాదన్నారు.

ఆంధ్రలో టీఆర్‌ఎస్‌ లేదని, తెలంగాణలో వైయస్‌ఆర్‌సీపీ లేదని, అలాంటిది ఎలా పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు. అసత్య ప్రచారానికి కేంద్రబిందువుగా టీడీపీ మారిందని దుయ్యబట్టారు.వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేకహోదా, రాష్ట్ర ప్రయోజనాలు కోసం పోరాడుతుందన్నారు.

 

Back to Top