ఏపీలోనే నెంబర్‌వన్‌ అవినీతి ఎమ్మెల్యే పెందుర్తి..

కోరుకొండ నరసన్న కొండను సైతం తవ్వేశారు...

వైయస్‌ఆర్‌సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఫైర్‌...

తూర్పుగోదావరి: రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ అవినీతిలో ఏపీలోనే నెంబర్‌వన్‌ అని వైయస్‌ఆర్‌సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు.అనుచరులతో కలిసి కోట్లాది రూపాయలకు దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు.గోదావరిలో ఇసుక నుంచి.. చెరువులో మట్టి వరుకూ దేన్ని వదలకుండా మింగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోరుకొండ లక్ష్మినరసింహస్వామి కొండను సైతం తవ్వేసి మట్టిని తరలించుకుపోయారని ఆరోపించారు.కాపు కార్పొరేషన్‌ లోన్లు ఇప్పిస్తామని సుమారు 2 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Back to Top