వైయ‌స్ఆర్ క‌న్న క‌ల‌లు వైయ‌స్ జ‌గ‌న్ జ‌గ‌న్ నిజం చేసి చూపిస్తున్నారు

 హోంమంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు: ఆనాడు దివంగత మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ‌.. మహిళలను లక్షాధికారిగా చూడాలని కలగన్నారని, నేడు ఆయన తనయుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ నిజం చేసి చూపిస్తున్నారని  హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.  మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. మంగళవారం వట్టిచెరుకూరులో ‘వైయ‌స్సార్‌ ఆసరా’ కార్యక్రమంలో పాల్గొన్న సుచరిత.. డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైయ‌స్‌ జగన్‌ తన పాదయాత్ర సమయంలో మహిళల కష్టాలు స్వయంగా చూశారని, అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ  పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.  వైయ‌స్సార్‌ చేయూత, ఆసరా, పావలా వడ్డీ, ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలను త్వరలోనే మహిళల పేరు మీద పంపిణీ చేయనున్నామని మంత్రి సుచరిత వెల్లడించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top