ఉన్న‌తాధికారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.  ఏలూరులో  అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షల వివ‌రాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై సీఎం ఆరా తీస్తున్నారు.  స‌మావేశంలో మంత్రులు ఆళ్ల‌నాని, పేర్ని నాని, తానేటి వ‌నిత‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.  

Back to Top