కరోనా నియంత్రణపై సీఎం వైయ‌స్‌ జగన్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో క‌రోనా నియంత్ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చిస్తున్నారు. కరోనాపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయ‌స్‌ జగన్ ఆదేశించారు. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలోనే ప్రధమ స్థానం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top