నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ.. 

సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌
 

 తిరుపతి జిల్లా: చంద్రబాబు తీరును ఎక్స్‌ వేదికగా సీఎం వైయ‌స్ జగన్‌ ఎండగట్టారు. ‘‘జగన్ ఒక టిప్పర్ డ్రైవర్‌కి సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు. అంతటితో ఆగలేదు, వేలిముద్రగాడంటూ వీరాంజనేయులుని అవమానించాడు. నువ్వు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకి టికెట్లు ఇచ్చావు చంద్రబాబు. నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా. నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ’’ అంటూ సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌ చేశారు.

Back to Top