కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో బుగ్గ‌న భేటీ

ఢిల్లీ : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఈ సందర్భంగా బుగ్గన మీడియాతో మాట్లాడారు.' పోలవరంకు నిధులతో పాటు జీఎస్టీ బకాయిలు, వివిధ పథకాలకు సంబంధించిన నిధులపై చర్చించాము. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ , పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరాము. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ మరోసారి ప్రస్తావించాం. రాష్ట్రానికి రూ. మూడు వేల కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉంది. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను రీయింబర్స్‌ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాం. బుగ్గన వెంట ఎంపీలు కృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్ , సలహాదారు అజయ్ కల్లం తదితరులు ఉన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top