పశ్చిమ గోదావరి జిల్లా: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 16వ రోజు షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ విడుదల చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు నారాయణపురం రాత్రి బస నుంచి వైయస్ జగన్ బస్ యాత్ర ద్వారా బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.