ఆర్బీకేల స‌హ‌కారంతో మేమంతా స‌కాలంలో పంటలు వేయగలుగుతున్నాం

ధాన్యం అమ్మిన నాలుగైదు రోజుల్లో డ‌బ్బు జ‌మ‌

కొణతాల వెంకట్రావు, రైతు

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా: వైయస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌లో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నార‌ని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆకుతీగ‌పాడుకు చెందిన రైతు కొణ‌తాల వెంక‌ట్రావు అన్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌తో అధికారంలోకి వ‌చ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. అనేక సంక్షేమ పథకాలు అందించారని, హామీ ఇవ్వని పథకాలను కూడా ఇవాళ అందించడంతో ప్రతి రైతు గానీ, ప్రతి సన్నకారు రైతుగానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా ఈరోజు వైయ‌స్ జగన్ వైపే చూస్తున్నారన్నారు. రైతు కొణ‌తాల వెంక‌ట్రావు ఏం మాట్లాడారంటే..

"మామూలు రైతుకే కాకుండా కౌలు రైతుకు కూడా రైతుభరోసా క్రింద రూ.13,500 ఇస్తున్నారు. ఫెర్టిలైజర్స్ యూరియా గానీ, డీఏపీ గానీ, 1026 గానీ, 1430 గానీ ఏ మందు అయినా మేము రూ.30, రూ.40 ట్రావెలింగ్ ఖర్చులు లేకుండా ప్రతి గ్రామంలో కూడా రైతుభరోసా కేంద్రం ద్వారా రైతులకు మందులు అందుబాటులో ఉండటంతో సకాలంలో మేమంతా పంటలు వేయగలుగుతున్నాం. ఇదివరకు బయటకు వెళ్లి తెచ్చుకుని సమయానికి వేయలేని పరిస్థితి. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి సంక్షేమ పథకాలు అందించారు. హామీ ఇవ్వని పథకాలను కూడా ఇవాళ అందించడంతో ప్రతి రైతు గానీ, ప్రతి సన్నకారు రైతుగానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా ఈరోజు జగన్ వైపే చూస్తున్నారు. గతంలో బ్రోకర్ల ద్వారా చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఇవాళ ధాన్యం రూ.1635, రూ.1636 లకు కొంటున్నారు. ఆర్బీకేల ద్వారా మేము ధాన్యం అమ్మితే 4, 5 రోజుల్లో డబ్బులు జమ అవుతున్నాయి ఇవాళ ఈ ప్రభుత్వంలో అంతా సంతోషంగా ఉన్నారు".

Back to Top