విజయనగరం జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. కొద్దిసేపటి క్రితం బస్సు యాత్ర విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. మోదవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ 21 రోజు బస్సుయాత్ర. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. విజయనగరం జిల్లా ఎంట్రన్స్‌లో సీఎం వైయస్ జగన్ బస్సుయాత్రకు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘనస్వాగతం పలికారు.