కడియపులంకలో పోటెత్తిన జనం 

తూర్పుగోదావరి జిల్లా: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర క‌డియ‌పులంక చేరుకుంది. క‌డియ‌పులంక‌లో జ‌న‌సేన‌కు ప్ర‌జ‌లు, వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు గ‌జ‌మాల‌తో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా రోడ్డుకిరువైపుల మ‌హిళ‌లు బారులు తీరారు. మేమంతా సిద్ధమంటూ సీఎం వైయస్ జగన్‌కు జనహారతి ప‌ట్టారు. బ‌స్సు యాత్ర కాసేప‌ట్లో రాజమండ్రి నగరంలోకి ప్ర‌వేశించ‌నుంది. రాజ‌మండ్రిలో సీఎం వైయస్ జగన్ రోడ్ షోలో పాల్గొంటారు. 

Back to Top