వైయస్‌ జగన్‌ను కలిసిన మహిళలు

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని అప్పలాయగుంట గ్రామంలో మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.  వేలిముద్రలు పడటం లేదని మూడు నెలలుగా రేషన్‌ ఇవ్వడం లేదని ఓ మహిళా, పింఛన్‌ఇవ్వడం లేదని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మా కోసం వైయస్‌ జగన్‌ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని మహిళలు మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని, జగనన్నకే మా ఓట్లు అని మహిళలు నినదించారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ మరో ఏడాదిలో మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.
 
Back to Top