నీ లాంటి వారికి తప్పకుండా దేవుడి ఆశీర్వాదం ఉంటుంది

నెల్లూరు: నాయనా.. మా అందరి కష్టాలు తెలుసుకునేందుకు నువ్వు పాదయాత్ర చేస్తున్నావు. ఇప్పటికే ఎన్నో వందల కిలోమీటర్లు నడిచావు. ప్రజల కోసం ఇంత కష్టపడుతున్నావు. నీ లాంటి వారికి తప్పకుండా దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. అందరి దీవెనలతో త్వరలోనే సీఎం అయ్యి మా ఊరికి రావాల’ అంటూ శిరసనంబేడుకు చెందిన ఇంద్రావతమ్మ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించింది. జననేత చిరునవ్వుతో స్పందిస్తూ తప్పకుండా అందరి ఆశీర్వాదాలతో త్వరలోనే మనందరి ప్రభుత్వం వస్తుందంటూ ముందుకు కదిలారు.   
Back to Top