వైయస్‌ జగన్‌కు వరదగోపాల్‌ కృతజ్ఞతలు


పశ్చిమ గోదావరి:  నెల్లూరు జిల్లా వాసి వరదగోపాల్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను కలిశారు.  తన చిన్న కుమారుడిని చదివిస్తున్నందుకు గానూ వైయస్‌ జగన్‌ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పెద్ద కుమారుడు బీటెక్‌ చదువుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మ హత్య చేసుకున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో పాదయాత్రగా వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో వారి పరిస్థితి చూసి వైయస్‌ జగన్‌ చలించిపోయారు. తన చిన్న కుమారుడిని చదివిస్తానని జననేత హామీ ఇచ్చినట్లు చెప్పారన్నారు. వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ. 10 వేలు సాయం చేశారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే ఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకోడని వరద గోపాల్‌ పేర్కొన్నారు. 
 
Back to Top