ఉపాధ్యాయులకు సామాజిక భద్రత క‌రువు

పశ్చిమగోదావరి : ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తోన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని  ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కలిసి తమ సమస్యలు విన్నవించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆదరాభిమానాలు చూరగొన్నారన్నారు. కానీ నేడు టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత లేకుండా చేసిందని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు బీఏ సాల్మన్‌రాజు, జి.కృష్ణ, జి.సుధీర్, యూటీఎఫ్‌ జయకర్, నరహరి తదితరులు వాపోయారు. సీపీఎస్‌ విధానం కారణంగా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయ కుటుంబం ఎటువంటి ఆర్థిక ఆసరా లేకుండా వీధిన పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీపీఎస్‌ విధానంలో ఉద్యోగులు, ప్రభుత్వం పెట్టే పెట్టుబడి కార్పొరేట్‌ శక్తులకు సిరిగాను, ఉద్యోగులకు ఉరిలాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసేలా హామీ ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులకు ఆరోగ్య పథకం సక్రమంగా అమలు చేసి వైద్యసేవలు అందించాలని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. 

Back to Top