చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యం..

మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నా..
వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న వీరభద్రాపురం గ్రామస్తులు
శ్రీకాకుళంః చంద్రబాబు హయాంలో మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వీరభ్రదాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఎలాంటి సంక్షేమ పథకాలు అందడంలేదని, మీరు సీఎం అయ్యాక మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటూ వీరభద్రాపురం గ్రామస్తులు జననేతను కలిసి మొరపెట్టుకున్నారు. రాజన్న బిడ్డ సీఎం అయితేనే మా గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.మారుమూల ప్రాంతమైన మా గ్రామానికి ఎలాంటి సదుపాయాలు అందడంలేదన్నారు. అభివృద్ధి అంతా శంకుస్థాపనలకే పరిమితం అయ్యిందన్నారు. బాబుహయాంలోఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు.lవైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ ప్రకటిస్తారని విశ్వసిస్తున్నామని నిరుద్యోగులు  తెలిపారు. జన్మభూమి కమిటీలు జోక్యంలేనిదే ఏపని కావడం లేదన్నారు. పూర్తిగా పచ్చచొక్కాలే లబ్ధిపొందుతున్నారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలనలో వందల ఇళ్లు తమ గ్రామంలో నిర్మించారన్నారు. టీడీపీ హయాంలో ఒక ఇళ్లు కూడా మంజూరు చేయలేదన్నారు. ప్రత్యేకహోదా వచ్చివుంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవన్నారు.వైయస్‌ జగన్‌ ఎప్పుడు సీఎం అవుతారా అని ప్రజలందరం ఎదురుచూస్తున్నామన్నారు.
Back to Top