న్యాయం అడిగితే అక్ర‌మ కేసులా..?

అర్హ‌త ఉన్నా పెన్ష‌న్ ఇవ్వ‌డంలేద‌ని న్యాయం అడిగితే అక్ర‌మంగా కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని తూటిప‌ల్లి గ్రామ‌స్తులు వైయ‌స్ జ‌గ‌న్‌కు  ఫిర్యాదు చేశారు. అర్హులంద‌రికీ పెన్ష‌న్లు అందేవిధంగా చూడాల‌ని జ‌గ‌న్‌ను కోరారు. నిజ‌మైన ల‌బ్ధిదారులైన వృద్ధులు, విక‌లాంగుల పింఛ‌న్లు ఎందుకు తొల‌గించార‌ని ప్ర‌శ్నిస్తే కేసులు బ‌నాయిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దౌర్జ‌న్యంగా అర్హ‌త‌లేనివారికి పింఛ‌న్లు మంజూర‌య్యే విధంగా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు.  జ‌గ‌న‌న్న‌తోనే  రాజ‌న్న ల‌క్ష్యం నెర‌వేరుతుందంటూ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 
Back to Top