భూగర్భజలాలను తోడేస్తున్నారు

కృష్ణాజిల్లా : ‘అన్నా.. చేపల చెరువుల పేరుతో అనుమతులు తీసుకుని రొయ్యలు సాగు చేయడంతో తాగు నీరు కలుషితం అవుతుంది’. అని మండవల్లి మండలం కానుకొల్లు ఎస్సీ కాలనీకి చెందిన మరియరాజు జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రెండు వేల ఎకరాలు అక్రమంగా రొయ్యల సాగు చేస్తున్నారని, దీంతో గ్రామంలోని బావులన్నీ ఉప్పునీరుగా మారి తాగేందుకు నీరు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అక్రమ రొయ్యల సాగు యథేచ్ఛగా కొనసాగుతుందని వాపోయారు.

చేపల సాగుకు నీటితో 0.5 శాతం ఉప్పునీరు ఉంటే సరిపోతుందని, రొయ్యల సాగుకు 8 శాతం ఉప్పు నీరు అవసరమని పేర్కొన్నారు. దీంతో ఉప్పునీటి కోసం 250 నుంచి 300 అడుగుల్లో విచ్చలవిడిగా బోర్లు వేస్తూ భూగర్భజలాలను తోడేస్తున్నారని వివరించారు. రొయ్యల సాగు వల్ల ఎస్సీ కాలనీలో నివసిస్తున్న 500 మం
Back to Top