మంత్రి దత్తత గ్రామంలో అభివృద్ధి ఉత్తదే..

జననేతను కలిసి ధర్మసాగరం గ్రామస్తులు
విశాఖపట్నం: మంత్రి అయ్యన్నపాత్రుడు దత్తత గ్రామంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. పేరుకే దత్తత గ్రామం... అభివృద్ధి అంతా ఉత్తదేనని ప్రజలు మండిపడుతున్నారు. అయ్యన్నపాత్రుడు కుటుంబం దత్తత తీసుకున్న ధర్మసాగరంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కన్నీరు పెట్టుకున్నారు. ఎస్సీకాలనీల్లో రోడ్లు సరిగ్గా లేవు, మంచినీరు రావడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ధర్మసాగరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని జననేతను విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేస్తానని హామీ ఇచ్చారని గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top