క్రైస్తవులపై దాడులు అరికట్టాలి

పశ్చిమగోదావరి : క్రైస్తవులు, చర్చిలపై జరుగుతోన్న దాడులను అరికట్టాలని క్రైస్తవులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎక్కడైనా చర్చి నిర్మాణం చేయాలంటే చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారిలో 15 మందితో సంతకం చేయిస్తేనే అనుమతి కల్పిస్తామని జీవో ఉందని వాపోయారు. అలాగే క్రిస్టియన్‌ మైనార్టీ నిధులు రాకుండా వేధిస్తున్నారన్నారు. నిబంధనలు సడలించి తమకు రావలసిన అనుమతులు, నిధులు సక్రమంగా వచ్చేలా చూడాలని కోరారు.
Back to Top