ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు

క‌ర్నూలు: అక్ష‌య గోల్డు యాజ‌మాన్యం చేసినా మోసాన్ని స‌హించ‌లేక వంద మంది ఏజెంట్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మ‌రో ఏజెంట్ సురేష్ బాబు అన్నారు.  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్‌ను అక్ష‌య గోల్డు బాధితులు, ఏజెంట్లు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా  వైయస్ జగన్ ఎదుట సురేష్ బాబు అనే ఏజెంట్ క‌న్నీరు పెట్టుకున్నారు..యాజమాన్యం ఆస్తులు అమ్మి బాధితుకు డబ్బులు చెల్లించాలని ..కోర్టు ఆదేశించినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. .అక్షయ్ గోల్డ్ యాజమాన్యం రూ.500 - రూ.600 కోట్లు బకాయి పడింద‌ని తెలిపారు. ఇప్పటికే 100 మంది ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.  ఏడాది పాటు ఓపిక పట్టండి..బాధితులందరికీ న్యాయం చేస్తాన‌ని వైయ‌స్ జగన్ హామీ ఇవ్వ‌డంతో బాధితులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
Back to Top