పప్పు- ప్రతిష్టలు

చంద్రబాబు ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులూ, సినిమావాళ్లు చాలామంది వచ్చారు. అయితే పార్టీ ఎందుకో ఎవ్వరికీ తెలియదు. బాబు గారి బర్త్ డే  ఫూల్స్ మంత్ అదే ఏప్రిల్ లోనే అయిపోయింది. లోకేష్ ఇంకా ఆయన కొడుకు దేవాన్ష్ ల పుట్టిన రోజులూ కాదు. మరేంటబ్బా అనుకుంటూ ఎదురుచూస్తున్నారు గెస్టులంతా. పార్టీ ఎందుకిస్తున్నారో కాసేపట్లో ఎనౌన్స్ చేస్తాం అని చెప్పారు సిఎమ్ గారు. 
ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మోడల్ లో కేక్ వచ్చింది. భూ ఆక్రమణలతో, సేకరణలతో, కబ్జాలతో రాష్ట్రాన్ని ఎలా కోసేసారో అచ్చం అలాగే కేకును చకచకా ముక్కలు చేసేసారు బాబు అండ్ చిన బాబు. ఆనందంగా ఒకరికొకరు తినిపించుకున్నారు. అప్పుడు మైకందుకున్నారు చంద్రబాబు. అసలీ పార్టీ అరేంజ్ చేయడానికి గల కారణం చెబుతాను. దానికంటే ముందు మీకు పేరు ప్రతిష్టల గురించి చెప్పాలి. నాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పేరు గురించి మీకు బాగా తెలుసు. వల్డ్ బాంకు నుంచి అప్పులు తేవడం నుంచి హైదరాబాద్ లో హైటెక్కులు కట్టే వరకూ నాకు బోలెడు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నా సంగతి పక్కన పెడితే…
అసలు పేరు రావాలంటే ఏం చేయాలి. 
పేరు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు కదూ.
అలా కాదు పెట్టిన పేరుకు పేరు రావాలంటే ఏం చాయాలి?
కొంచెం డిఫికల్ట్ గా ఉంది కదూ.
పేరుకు పేరు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు మరి. 
ఏదైనా సాధించి పేరు తెచ్చుకోవచ్చు. లేదా నాలా ఎందరినో సాధించి పేరు తెచ్చుకోవచ్చు.
సాయం చేసి పేరు సంపాదించుకోవచ్చు. లేదా నాలా మోసం చేసీ పేరు తెచ్చుకోవచ్చచు.
చదువులు, ఆటలు, పాటలు, రాతలు, కోతలు, సినిమాలు, సింగినాదాలు ఇలా ఏదో ఒకదాన్లో ఎంతో కొంత పేరు తెచ్చుకోవచ్చు.
ఇదంతా కష్టం అనుకుంటే చెడ్డపనులు, చెత్తపనులూ చేసి కూడా పేరు తెచ్చుకోవచ్చు. 
ఇంతకీ ఆ పేరు ఎంత పేరు, ఎంతటి పేరు, ఎంత మందికి తెలిసే పేరు అనేది కూడా ముఖ్యమే. 
కాని ఏ ఇష్యూ కి సంబంధం లేకుండా, ఏ ఒక్కటీ సాధించకుండా, ఏమీ చేయకుండా కూడా పేరు తెచ్చేసుకోవచ్చని నిరూపణ అయ్యింది. 
అది కూడా అలాంటి ఇలాంటి పేరు కాదు పేరు తప్ప ఊరులేని రాజధాని కొచ్చినంత పేరు.
డిజైన్లలో తప్ప డైరెక్టుగా కనిపించని అమరావతి కున్నంత పాపులారిటీ.
ఆంధ్ప్రదేశ్ పేరు చెబితే చాలు దానితోపాటు ఈ పేరు కూడా జంటగా వినిపిస్తోంది. 
సిఎమ్, పిఎమ్, రాష్ట్రపతి వంటి వారికి కూడా దక్కని అదృష్టం అది….
ఇంతకీ ఎవరికి పేరొచ్చింది…? ఆ పేరొచ్చిన వారి పేరుకు కారణం ఏమిటి?
ఆ పేరొచ్చిన వారికి ఎందులో పేరొచ్చింది? 
ఇవి మీ అందరి కామన్  క్వశ్చన్స్  కదా…!
చెబుతాను. 
ఆ పేరొచ్చింది ఎవరికో కాదు…మా బాబు లోకేష్ కు.
ఇప్పుడు కొత్తగా రావడం ఏంటి…చినబాబుకు ఎప్పటి నుంచో పేరుంది కదా అనుకుంటున్నారా…అవుననుకోండి…
అలవోకగా అడ్డదారిలో మంత్రి అయిపోయినందుకు, అన్నీ మాటలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నందుకు, అతుకుల బొంతలా అర్థంలేని పనులు చేస్తున్నందుకు చినబాబుకు చాలా పేరే ఉంది. 
అయితే ఇప్పుడది గూగుల్ సెర్చింజన్ దాకా పాకింది. 
గూగుల్ సెర్చ్ లో ఆంధ్రప్రదేశ్ పేరు టైప్ చేయడానికి ప్రయత్నించండి. ఆ పేరు పూర్తి అయ్యేలోపు కింద వచ్చే రిజల్ట్స్ ని ఒకసారి గమనించండి. కేపిటల్, సిఎమ్, మాప్, హైకోర్టు వంటి వాటితో పాటు పప్పు అని కూడా కనిపిస్తోంది. అంటే గూగుల్ లో ఆంధ్రప్రదేశ్ గురించి వివరాలు చూసే వారిలో రాజధాని గురించి ఎంక్వైరీ చేసినంతగా పప్పూ గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇంతటి పేరు దేశంలో రాహుల్ గాంధీ తర్వాత చినబాబుకు అదే పప్పు బాబుకే వచ్చింది – పుత్రోత్సాహంతో కన్నీళ్లొచ్చాయి చంద్రబాబుకి. 
అందుకే ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోడానికే ఈ పార్టీ ఇస్తున్నాను అన్నాడు కళ్లుతుడుచుకుంటూ, అతిథులంతా కూడా ఆనందంతో చప్పట్లు కొట్టారు. 
అది చూసి పప్పు బాబు ఉబ్బి తబ్బిబ్బై పోతున్నారు. 



Back to Top