ఎటుపోతున్నాం బాబూ గారు ?

ఆయనే రావాలి ఆయనొస్తేనే బాగుంటుంది అని ఎన్నికలకు ముందు టీవీ లలో ప్రచారం చేసిన బాబు రాష్ట్రం లో మహిళల పట్ల జరుగుతున్నా దాడులు, హత్యలపై  ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?
ఎటుపోతున్నాం బాబూ గారు ?
ప్రతిపక్షంలో ఉనప్పుడు ఎక్కడో ఢిల్లీలో మహిళలపై దాడి జరిగినా  ప్రెస్ మీట్ పెట్టి దేశం ఎటుపోతోంది అనే అవేదన చెందేవారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నదేమిటి?

కాంగ్రెస్ పాలనలో ఆడపిల్లలు కాలేజ్‌కు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉందంటూ ఎన్నికల ముందు పదేపదే ఆయనే రావాలంటూ ప్రకటనల ప్రసారం చేయించారు. మరీ నాగార్జున యూనివర్శిటీలో రిషికేశ్వరి ఆత్మహత్యపై సీఎం ఎందుకు స్పందించరు?. దీనిపై రాష్ట్రంలోని విద్యార్థి లోకం ఉడికిపోతున్నా ఒక్క ప్రకటన చేయలేదెందుకు?. నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధి రిషికేశ్వరి మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయి


మహిళా తహసీల్దార్‌ను ఓ ఎమ్మెల్యే,అతడి అనుచరులు ఇసుక రీచ్‌లో పడేసి కొడితే చంద్రబాబు స్పందించలేదు. పైగా తహసీల్దార్ వనజాక్షే సరిహద్దులు దాటి వెళ్లారని తప్పుపట్టారు. అంటే ఒకవేళ సరిహద్దు దాటి వెళ్లినంత మాత్రాన కొట్టేస్తారా!

తహసీల్దార్ వనజాక్షిపై దాడి తరహాలోనే ఆదివారం(జులై 26) గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ కొందరు భూకబ్జాదారులు వీఆర్‌ఓ, వీఆర్ఏలను టీవీ కెమెరాల సాక్షిగా కొడితే చర్యలు లేవెందుకు?. ప్రజలతో  కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ప్రతి అంశంపై ప్రెస్ మీట్లు పెట్టే ముఖ్యమంత్రి మహిళలు, ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించి వెనువెంటనే చర్యలు తీసుకోవడం లేదు ?.

Back to Top