బాబుకు మూడింది

సార్ సార్ పరిగెత్తుకొచ్చాడు చంద్రబాబు పిఎ. 
‘ఏంటయ్యా’ రాజధాని డిజైన్ల గురించి రాజమౌళి, బోయపాటిల తర్వాత ఎవరితో చర్చించాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న బాబు చిరాగ్గా రియాక్ట్ అయ్యాడు. 
మళ్లీ మనకి మూడింది సార్ అన్నాడు కంగారుగా
మూడేమిటీ మూడున్నార అయిపోతేను. గట్టిగా ఇంకా రెండేళ్లుకూడా లేదు నాకు ఈ సీటు లైఫ్ స్పాన్ బాధగా అన్నాడు చంద్రబాబు. 
అబ్బా నే చెప్పేది అదికాదు సర్. ఈ రెండేళ్ల లోపే మీకు రాబోయే మరో గండం గురించి.
ఇప్పుడిక గండాలేమున్నాయయ్యా..
అందరికీ ఇవ్వాల్సిన విచ్చేస్తున్నాం కదా. 
ప్రజలకు కుప్పల కుప్పల హామీలు, ఎన్నికలున్న చోట్ల కోట్లరూపాయిల పంపకాలు, పక్కపార్టీ వాళ్లకి కావాల్సినన్ని ప్రలోభాలు, పార్టీలో ఉన్న వాళ్లకి కోరుకున్నన్ని కబ్జాలు, కేసుల నించి మినహాయింపులూ…నోరెత్తే వాళ్లకి లాఠీల బహుమతులు, ఉద్యమించే వాళ్లకి గృహనిర్బంధాలూ…ప్రతిపక్షాలకి అడ్డగోలు జవాబులు…ఇన్ని చేస్తుంటే మనకేం గండం ఎదురౌతుందీ..చాన్సేలేదు…
కట్టతెగుతుంటే కాలడ్డు పెట్టినట్టుంది సార్ మీరు చెప్పేది. కొంప మునుగుతోందంటే కరెంటు స్తంభం ఎక్కుతున్నట్టుంది సార్ మీరనేదీ. సమస్యలను అణగదొక్కేసి, ప్రజలను ఎక్కి తొక్కేస్తే ప్రాబ్లమ్స్ తీరవు సర్. మీరొక చోట నొక్కితే మరో చోట నించి పుట్టుకొస్తాయి. అదే సర్ మీకు నే చెప్పబోయేది అన్నాడు పిఎ.
అయితే ఏంటంటావ్ సంగతి అడిగాడు బాబు మళ్లీ ఏం నెత్తిమీదకొచ్చి పడిందో అనుకుంటూ..
మరేమో మళ్లీ…పిఎ నసగుతున్నాడు.
చెప్పవయ్యా విషయం ఏమిటో మన చినబాబు గానీ మళ్లీ ఏమైనా నోరు జారాడా అడిగాడు బాబు. వర్ధంతి శుభాకాంక్షలు, జయంతికి సంతాపంగానీ ప్రకటించాడేమో అని భయపడుతూ.
లేదు సార్ అన్నాడు పిఎ
మన పార్టీ వాళ్లు మళ్లీ ఎవరినైనా చెప్పులతో, చేటలతో కొట్టారా? దాడులు చేస్తూ జనాలతో ఛీ కొట్టించుకుంటున్న తెలుగు తమ్ముళ్లను తలుచుకుంటూ.
కాదు సార్ అన్నాడు పిఎ
కొత్త స్కీమ్ ల లోని స్కామ్ లేవన్నా మళ్లీ బైట పడ్డాయా…ఏ పేరుతో మసిపూసినా ప్రతిపక్షం ప్రజల ముందు బట్టబయలు చేయడం గుర్తుచేసుకుంటూ అడిగాడు బాబు 
అలాంటిదే కాని అది కాదు సార్ చెప్పాడు పిఎ.
అసలేంటో చెప్పవయ్యా బాబు విసుక్కున్నాడు చంద్రబాబు.
చేనేతలకు రుణమాఫీ, ముడిపట్టు రాయితీ, చేనేత పార్కులు, ఇళ్లు, మగ్గం షెడ్లు అని హామీలిచ్చారు కదా. అవన్నీ చేయకపోతే మరో భేరి మోగిస్తామంటున్నార్ సర్…
ఎవరు…
ఇంకెవరు చేనేతలు….
ఆ..మోగించనీ… చెవులు మూసుకుంటే అవేం మనకు వినబడవు.
వాళ్లకి తోడుగా జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారు సర్..ధర్మవరంలో చేనేతలను కలిసి, ఇంకా ఎక్కడెక్కడ చేనేత కార్మికులు కష్టాలు పడుతున్నారో వారందరినీ కలుపుకుని, ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేయబోతున్నారు సర్. మొన్న హోదా కోసం యువభేరితో మీ కర్ణభేరి దద్దరిల్లేలా చేసారు గదా…ఇప్పుడు చేనేతల కోసం సమరభేరి మోగిస్తున్నారు. 
తలపట్టుకున్నాడు బాబు…
ఝండూ బామ్ తెమ్మంటారా సార్ అడిగాడు పిఎ.
కాదు ఒక కేజీ దూది పట్రా…
ఎందుకు సర్….?
చెవుల్లో కుక్కుకోడానికయ్యా…..ఇప్పటిదాకా మనం ఫాలో అవుతున్న ఫార్మలా ఇదే కదా…ప్రజల కష్టాలు చూడకుండా కళ్లు మూసుకోవాలి. ప్రతిపక్షాల ప్రశ్నలు వినకుండా చెవులు మూసుకోవాలి. హామీలు తీర్చమని అడిగితే నోరు మూసుకోవాలి. మనం ఇలా ఫాలో అవుతున్నాం. అన్నాడు బాబు. 
సింహం సింగిల్ గా వస్తే ఇది వర్క్ అవుట్ అవ్వదేమో సార్ హెచ్చరించాడు పిఎ…
ఆలోచనలోపడ్డాడు చంద్రబాబు. 
Back to Top