స్మార్ట్ ఫోన్ లిస్తాం

చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాడు
నగదు రహితంపై ముఖ్యమంత్రుల కమిటీ ఏం తేల్చింది? అని అడిగారు విలేకరులు
ఈ దేశంలో 80 శాతం మందిలో నగదు లేదు. మిగిలిన 20 శాతం మందికి నగదు అందకుండా చేసాం. ఆ రకంగా నగదు రహితం సాధించాం
చదువులేని పేదవాళ్లు డిజిటల్ చెల్లింపులు ఎలా చేస్తారు
ఏదైనా నేర్చుకుంటే వస్తుంది. అందుకే స్మార్ట్ ఫోన్లపై రాయితీలు ఇస్తున్నాం
ఫోన్ల కంపెనీతో డీల్ కుదిరిందా?
మీరు ప్రతి దాన్ని అనుమానిస్తారు. ఈ దేశం సామాన్యున్ని కూడా చైతన్యపరచడమే మా ధ్యేయం
ధ్యేయం బానే వుంది. కానీ ప్రతి మనిషికి కావాల్సింది తిండి కదా. అది లేకుండా స్మార్ట్ ఫోన్ ని ఏం చేస్తారు? కొరుక్కుతింటారు
ఎప్పుడూ తిండి తిండి అంటూ వుంటాం కాబట్టి మనం వెనుకబడి వున్నాం
ఈ రోజు మీరేం తిన్నారు?
డ్రైఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్, నేను తినేదంతా ప్రోటీన్ ఫుడ్డే

మీరు జనం సొమ్ము బాగా తినేసారు కాబట్టి ప్రోటీన్ ఫుడ్డు తింటున్నారు. కానీ సామాన్యజనానికి పొటాటోలు కూడ దొరకడం లేదు
ఎవరికి వాళ్లే సంపాదించుకోవాలి
నగదుని రద్దు చేసి అందరినీ రోడ్డుమీదకి ఈడ్చారు. ఇంకేం సంపాదించుకుంటారు
నేను చేపలు వడ్డించాను, చేపలు పట్టేది నేర్పిస్తాను
మీకు ఓట్లేసి జనం వలలో చిక్కుకున్న చేపల్లా గిలగిల్లాడుతున్నారు
వలలో చిక్కితే అది వాళ్ల తప్పు
ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించండి
నేను 24 గంటలూ అదే ఆలోచిస్తా. ప్రజలకే నా హృదయం అంకితం.
ఏమి ఆలోచిస్తున్నారు?
అమరావతిని విశ్వనగరం ఎలా చేయాలి? 8 లేన్ల రోడ్డు నిర్మించాలి. రైతుల భూములన్నీ లాక్కుని బడాబాబులకి పంచిపెట్టాలి
ఇందులో జనానికి పనికొచ్చే విషయం ఒకటి చెప్పండి
రోడ్లు వేస్తే దర్నీ ఈజీ అయిపోతుంది కదా
మీ అధికారులకి, కాంట్రాక్టర్లకి ఈజీ అయిపోతుంది. ఒక రైతుకి, కార్మికుడికి ఏం జరుగుతుంది?
వాళ్లు కూడా ప్రయోగాలు చేస్తారు కదా
గతంలో కూలి దొరక్క వలస వెళ్లే వారు. మోదీ పుణ్యమా అని దేశంలో ఎక్కడా కూలీ దొరకడం లేదు
అయితే ఇప్పుడేం చేయమంటారు
మీరేం చేయక్కర్లేదు. రేపు ఎన్నికల్లో ప్రజలే చేయాల్సింది చేస్తారు
Back to Top