బాబుకు షాకు ప‌వ‌న్ కు షేకు

 పాకిస్తాన్ అంత అమాయ‌క దేశం లేదు..భార‌త జ‌వాన్ల మీద దాడి దానికేం సంబంధం లేదు, అంత‌ర్గ‌త ద్రోహులే ఇలా చేసారంటూ చంద్ర‌బాబు చేసిన చౌక‌బారు వాఖ్య‌ల‌కు తాజా స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చెంప‌ద‌బ్బ కొట్టింది. ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుపెడుతూ భార‌త వాయుసేన విరుచుకుప‌డ‌టం బాబుకు తిప్పుకోలేని త‌ల‌వంపులు తెచ్చింది. బీజేపీ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డానికి దేశ ప్ర‌ధానిని కూడా వాడుకోవాల‌ని చూసిన బాబుకు సైనిక‌చ‌ర్య చెమ‌ట‌లు ప‌ట్టించింది. షాకుల‌మీద షాకులు కొట్టించింది. ఇది ఒక వార్త అయితే....ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్న ముఖ్య‌మంత్రిని రాష్ట్ర అధోగ‌తి గురించి, రాష్ట్రానికి రాని హోదా గురించి అడ‌గ‌డం, క‌డ‌గ‌డం మానేసి, అధికారంలో లేని ప్ర‌తిప‌క్ష‌నేత‌ను మాత్ర‌మే ప్ర‌శ్నించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓ సాధార‌ణ రైతు షేక్ చేసి షింక్ చేసేసాడు.

అదీ ప‌బ్లిక్ మీటింగ్ లో....ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌బ్లిక్ మీటింగులో మైకు ప‌ట్టుకుని ఓ రైతు అందిరినీ ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు బాగుప‌డాలంటే వైఎస్ జ‌గ‌న్ రావాలయ్యా అంటూ త‌న మ‌న‌సులోని మాట ప‌వ‌న్ ముందు బైట‌పెట్టాడు. జ‌గ‌న్ కి మాత్ర‌మే ఓటేయండి అంటూ స‌భ‌లో అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేసాడు. జ‌గ‌న్ ముఖ్య మంత్రి అయితే రైతులకు మంచిరోజులొస్తాయ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు ప‌వ‌న్ ముఖం మీదే చెప్పాడు. బిత్త‌ర‌పోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడునిమిషాలు తేరుకోలేక‌పోయాడు. ఎల్లో సిండికేట్లు గా మారి వైఎస్ జ‌గ‌న్ పై విరుచుకుప‌డే వారికి వాస్త‌వాలు, ప్ర‌జ‌లు క‌లిసి బుద్ధి చెబెతున్నాయి. అడుగ‌డుగునా ప్రేలాప‌న‌ల‌కు పిడిగుద్దులు ప‌డుతున్నాయి. అదుపులేని నోరు అడ్డంగా వాగితే స‌మాజం తిర‌గ‌బ‌డి స‌ర్జిక‌ల్ స్ట్రైక్ తో నాలుక మీద వాత‌లు పెడుతోంది. పెడ‌బొబ్బ‌లు పెట్ట‌డం త‌ప్ప ఈ స్వార్థ‌ప‌రుల‌కు మ‌రో దారి లేకుండా పోతోంది.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top