ప్రతీ గడపకూ వెళ్ళి అభివృద్ది, సంక్షేమాన్ని వివరిద్దాం

విస్తృత స్థాయి స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

విజ‌య‌న‌గ‌రం:  ప్రతీ గడపకూ వెళ్ళి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. గజపతినగరం నియోజక వర్గం వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం గొట్లాం సత్యా ఫంక్షన్ హాల్లో  శాసనసభ్యులు బొత్స అప్ప నరసయ్య అధ్య‌క్ష‌త‌న  నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విద్యా శాఖామాత్యులు  బొత్స సత్యనారాయణ  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేసిన న‌వ‌ర‌త్నాలే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న పార్టీ అభ్య‌ర్థుల‌ను అఖండ మెజారిటీతో  గెలిపిస్తాయ‌న్నారు.  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  మూడున్న‌రేళ్ల పాల‌న‌లో  చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు.  కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేసిన విషయాన్ని, అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ప్రతీ ఒక్కరికీ అందజేసిన విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివ‌రించారు. ప్రతీ ఒక్క‌రికీ జరిగిన మంచి గుర్తు చేయడం, మీ దీవెనలు, ఆశీస్సులు కావాలని అడగాల‌న్నారు.

  సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్,  జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు , శాసన మండలి సభ్యులు డాక్టర్ పి వి వి సూర్య నారాయణ రాజు (పెనుమత్స సురేష్ బాబు) , పాలవలస విక్రాంత్ ,  నియోజకవర్గం పరిధిలోని మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్.పి.టి.సి.లు, వై.య‌స్.ఆర్.సి.పి. ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top