మాట ఇచ్చిన చోటే మరో చరిత్ర

వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌
 

పశ్చిమ గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో చరిత్రాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది.  ప్రజా సంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆటో, కారు, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చోటే ..ఇవాళ వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. మాట తప్పని మడమ తిప్పని కుటుంబంగా ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా మహానేత వైయస్‌ఆర్‌ తనయుడు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను వరుసగా నిలబెట్టుకుంటున్నారు. ఒక్కొక్క హామీ అమలుకు అడుగులు వేస్తున్నారు. ఆశా కార్యకర్తల వేతనాలు. అంగన్‌వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు ఇప్పటికే పెంచిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు. సచివాలయాల ఏర్పాటు. రేషన్‌ కార్డుదారులకు నేరుగా ఇంటికే నాణ్యమైన బియ్యం పంపిణీ. పంట నష్టపరిహారం పెంపు. ఇలా ఒకటేంటి పాదయాత్రలో ఇచ్చిన  ప్రతి హామీని అమలు చేస్తున్నారు. తాజాగా వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏలూరులో లాంఛనంగా ప్రారంభించారు.  
 

Back to Top