తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, ఈనెల 21న, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం, ఆరోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది. ఎమ్మెల్యేలు, పార్టీ కో–ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుని.. పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులను భాగస్వామ్యం చేస్తూ, జగన్‌గారి పుట్టినరోజు వేడుకలు అన్ని స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలని నిర్దేశించింది.