అచ్చెన్నాయుడును మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి

వ్యవసాయ శాఖలో అవినీతిపై దర్యాప్తు చేపట్టాలి

వైయ‌స్ఆర్‌సీపీ టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త పేరాడ తిలక్ డిమాండ్‌

శ్రీ‌కాకుళం: రైతుల పనిముట్లలోనూ అవినీతికి పాల్పడుతున్న వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును మంత్రివ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖలో మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న అవినీతిపై బహిరంగ దర్యాప్తు చేపట్టి, సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయ‌న కోరారు. బుధవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో తిల‌క్ మీడియాతో మాట్లాడారు.

పేరాడ తిలక్ ఏమ‌న్నారంటే..

  • రైతులకు సబ్సిడీపై అందజేసే వ్యవసాయ పనిముట్లు లోను అచ్చెన్నాయుడు తన ఓఎస్‌డీ పోలి నాయుడు తో అవినీతికి పాల్పడుతున్నారు. 
  • పనిముట్లు తయారు చేసే కంపెనీలతో మధ్యవర్తిత్వం వ్యవహరించి డబ్బులు వసూలు చేయాలని ఆగ్రో జిఎం పై ఒత్తిడి తీసుకువచ్చి ఆ పని చేయలేను అన్న జిఎంను నెల్లూరు బదిలీ చేశారు.
  • వ్యవసాయ కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటున్న అచ్చెన్నాయుడు రైతులను నిలువెత్తున ముంచుతూ రైతుకు రావలసిన సబ్సిడీలో అవినీతికి పాల్పడుతున్నారు.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై దర్యాప్తు చేయించి మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం
  • 2018లో తిత్లీ తుపాను వలన నష్టపోయిన రైతాంగానికి ఇన్సూరెన్స్ ను తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోగా రైతాంగానికి  2019లో  ఇన్సూరెన్స్ సబ్సిడీ అందజేసి ఆదుకున్న ఘనత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారిదే..
  • నందిగాం మండలంలో నిర్మాణం పూర్తయిన విత్తనోత్పత్తి కేంద్రానికి మిగతా సదుపాయాలు కల్పించి దానిని ప్రారంభించేందుకు వ్యవసాయ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నేటి వరకు  ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
  • అచ్చెన్నాయుడు తన కుటుంబ సభ్యులు నిరంతరం అవినీతిపైన దృష్టి సారిస్తున్నారు తప్ప అభివృద్ధిలో గాని రైతు సమస్యలు పరిష్కారం పైన గాని దృష్టిసారించడం లేదు
  • రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్న యూరియా పంపిణీకి నేటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు 
  • ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టెక్కలిని జిల్లా కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చిన అచ్చెన్నాయుడు నేడు ఎందుకు ఆ ప్రతిపాదన చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం.
  • కొంతమంది తెలుగుదేశం నాయకులు అవగాహన రాయిత్యంతో అచ్చెన్నాయుడు పాల్పడుతున్న అవినీతికి మద్దతు తెలపడం సిగ్గుచేటు.. 
  • రైతులకు ఉచిత పంటల భీమా ప్రీమియం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నాం..
  • ఈ కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురునాథ్ యాదవ్, సంతబొమ్మాలి జడ్పిటిసి సభ్యులు పాల వసంత రెడ్డి, నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు హనుమంతు వెంకటేశ్వరరావు, సంపతిరావు,హేమసుందర రాజు,తమిరి ఫాల్గుణరావు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కిల్లి అజయ్, పోలాకి మోహనరావు కర్ణిక జీవన్, పేరాడ వెంకట్రావు, బమ్మిడి కూర్మారావు, పినకాన వైకుంఠరావు, టంకాల హిమాకర్, టంకాల బాబురావు తదితరులు పాల్గొన్నారు
Back to Top