బాలకృష్ణపై ‘అనంత’ ఆగ్రహం

 అనంత‌పురంలో అంబేద్కర్ విగ్రహం ముందు యువజన, విద్యార్ధి నాయకుల నిరసన 

బాలకృష్ణ ఫ్లెక్సీని చొప్పులతో కొట్టి నిరసన

బాలకృష్ణ వ్యాఖ్యలు సభ్యసమాజంలో సిగ్గుచేటు 

వెన్నుపోటు పొడిచిన బావని ఏమి అనలేక ప్రజానాయకుడు మీద నిందలు 

కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధి ప్రసాదించాలి 

తండ్రి పార్టీ తాకట్టు పెట్టిన బాలయ్య ఎక్కడ?

ప్రజా క్షేత్రంలో నిలబడే ముఖ్యమంత్రి అయిన వైయ‌స్ జగన్ ఎక్కడ?

జిల్లాకు ఎన్టీఆర్ గారి పేరు పెట్టిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని అలా మాట్లాడతారా

 అన్నని ఏం మాట్లాడినా ప్రశ్నించకుండా మౌన దీక్షలో పవన్ 

అనంతపురం :  మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో అయినటువంటి నందమూరి బాలకృష్ణ యొక్క బసావతారకం హాస్పిటల్ కి మరియు వారి సినిమాలకు ఎంతగానో సహకరించారని అలాంటి వ్యక్తిపై నిన్నటి రోజున నోరు పారేసుకుని బుద్ధి మందగించి మాట్లాడిన మాటలను వైయ‌స్ఆర్‌సీపీ యువజన,విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండిస్తున్నదని నాయకులు అనంతపురం జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహనికి వినతిపత్రం సమర్పించారు. తర్వాత నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బాలకృష్ణ వ్యాఖ్యలు సభ్య సమాజంలో సిగ్గుచేటు. బాలకృష్ణ  గౌరవాన్ని ఆదపాతాళానికి దిగజారిపోయిందని ప్రజలకు మంచి చేసిన వారిని తూలనాడను బాలకృష్ణకు అలవాటుగా మారుతుందని, వారి తల్లిని తిట్టిన బిజెపిని వాటేసుకున్న ఘటన బాలయ్య బాబుదైతే అదే తల్లిని తిట్టిన టిడిపిని వాడేసుకున్న చరిత్రహీనుడు పవన్ కళ్యాణ్.  ప్రజా నాయకుడు అయినటువంటి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీద అక్కసుతో నిన్నటి రోజున అసెంబ్లీలో అసభ్య పదజాలంని రికార్డులు యందు తొలగించాలని మెగా అభిమానులు సైతం చిరంజీవి గారిని ఎవడు అని అన్న  బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా చురుకులంటిస్తుంటే ఏమీ మాట్లాడకుండా మౌన దీక్ష వహిస్తున్న డిప్యూటీ సీఎం ప్రవర్తన తీరుని మెగా అభిమానులు కూడా గమనిస్తున్నారు . గతంలో కూడా ఇలా చేసిన ఘనత ఒక చిరంజీవి గారి విషయంలో బాలకృష్ణకు దక్కుతుందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.

యువజన నగర అధ్యక్షులు దత్త రాయల్, జిల్లా ఉపాధ్యక్షులు దాదు మాట్లాడుతూ.. అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే కామినేని హీరోల మూలాకత్ గురించి ప్రస్తావించడం బాలయ్య అందుకు వ్యంగ్యంగా అసభ్యభాజాలంతో మాట్లాడటం స్పీకర్ స్థానంలో ఉంటూ రఘురామకృష్ణం రాజు వారించకపోగా నవ్వుతూ ఉండడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.  నగర అధ్యక్షులు కైలాష్ మాట్లాడుతూ బాలకృష్ణ ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో యువజన విభాగం నగర ఉపాధ్యక్షులు వినీత్, ఉదయ్, మైను, రోహిత్ విద్యార్ధి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ రాయల్, నగర కార్యదర్శులు అశోక్ రాయల్, ఫయాజ్, నరేంద్ర రెడ్డి, నవాజ్, రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top