తాడేపల్లి: ఎన్నికల తరుణంలో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి వైయస్ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లిలో మంగళవారం ఓటర్ల జాబితాలకు సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ నేతలకు వర్క్ షాప్ నిర్వహించారు. ముందుగా దివంగతనేత స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వర్కషాప్ కు ముఖ్యఅతిధిగా హాజరైన పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రానున్న నాలుగు నెలలు ఓటర్ల జాబితాలకు సంబంధించి కీలకమైన రోజులని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రధ్ద వహించి పనిచేయాలన్నారు. ఓటర్ల చేర్పులకు సంభందించి ఇతర అంశాలపై ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించడం, అనర్హులైన వారిని గుర్తించడం కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ఎటువంటి అనుమానాలున్నా కూడా నివృత్తి చేసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీకి అంకితభావంతో పనిచేసే వ్యక్తులను నియమించుకుని పోలింగ్ బూత్ లెవల్ నుంచి ఓట్లజాబితాలను పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ అందులో ఓటర్ల సంఖ్య దగ్గరనుంచి ఇటీవల జరిగిన మార్పులు చేర్పులను సరిచూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో అర్హులైన ఓటర్లందరికి ఓటు హక్కు కల్పించి తద్వారా జరిగే ఎన్నికలలో వారి మధ్దతు పొందాలన్నారు. ఆయా పోలింగ్ బూత్ లలో అర్హులైన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించేవిధంగా పనిచేయాలని కోరారు. జేసిఎస్ కోఆర్డినేటర్లు,గృహసారధులు,పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు అందరి సహకారం తీసుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రత్యర్దిపార్టీలు దుష్ప్రచారం నేపధ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరం అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గత నాలుగేళ్లుగా అమలు చేసిన పధకాలతో ప్రజలంతా వైయస్ఆర్‌సీపీని గెలిపించేందుకు సిధ్దంగా ఉన్నారు. పాజిటివ్ ఓటుతోపాటు మరింతమంది వైయస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అయితే ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తీసుకువచ్చి స్వేఛ్చగా ఓటు వేసుకునేలా చేయాల్సిన బాధ్యత పార్టీ యంత్రాంగంపై ఉందని అన్నారు. ఈ విషయంపై అందరూ సీరియస్ గా దృష్టి సారించి పనిచేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని గత కొద్దినెలలుగా టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. మరోవైపు ఆ పార్టీ కర్త, కర్మ, క్రియగా నడిపిస్తున్న పచ్చమీడియా పత్రికలు,ఛానెళ్లు కూడా అడ్డగోలు రాతలు, టీవీల్లో ప్రసారాలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీనే పెద్ద ఎత్తున ఓటర్లను తొలగిస్తుందనే ఆరోపణతో వారు తెగ హడావిడి చేస్తున్నారు. అయితే ప్రజలకు వాస్తవాలు తెలుసు. అయినా తమ దుష్ప్రచారంతో ప్రజలలో అయోమయం సృష్టించేందుకు తెలుగుదేశం నేతలు,పచ్చమీడియా చేస్తున్న కుట్రలను కంట కనిపెడుతూ వైయస్ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడాలనే తపనతో వైయస్ఆర్‌సీపీ ఉంది. అందుకుగాను, ఎన్నికల కమిషన్ సమ్మరీ రివిజన్‌ను ఆసరాగా చేసుకుని బూత్‌లెవల్ ఏజెంట్లను పెట్టుకుని పక్కాగా బీఎల్‌వోల ద్వారా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దొంగ ఓట్లను తొలగించేపని గతంలో చేశామన్నారు.అదే తపనతో పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు. గతంలో ఎన్నికలలో టిడిపి పాల్పడిన అవకతవకలకు సంబంధించి ఉదాహరణపూర్వకంగా వివరిస్తూ వైజాగ్ ఈస్ట్ నియోజకవర్గంలో 2019 లో ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత జనవరి 12 నుంచి మార్చి రెండోవారంలోపు దాదాపు 40 వేల దొంగఓట్లను టిడిపి చేర్పించింది.జనాభా నిష్పత్తి రెష్యో ప్రకారం ప్రతి వందమంది జనాభాకు 70 మంది ఓటర్లు ఉండాల్సి ఉంది. కాని ఆ నియోజకవర్గంలో ప్రతి వందమందికి 86 గా నిష్పత్తిగా ఉంది. నియోజకవర్గం మొత్తంగా చూసినట్లయితే దాదాపు 40 వేల అనర్హుల ఓట్లు అదనంగా చేర్చడం ద్వారా ప్రజాతీర్పును అపహస్యం చేసి దొంగదారిలో గెలిచేందుకు అవకాశం ఏర్పడింది.దానిని ఉదాహరణగా తీసుకుంటే అర్బన్ ప్రాంతాలలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా గమనించాలని కోరారు.మారీచుల వంటి వారితో పని చేస్తున్నామనే విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సేవామిత్రయాప్ ను టీడీపీ బూత్‌కన్వీనర్లకు అనుసంధానం చేయడం వంటి ప్రక్రియను అప్పట్లో నడిపారు. అంటే, ప్రభుత్వ డేటాను వారి చేతుల్లో పెట్టుకుని దాన్ని రాజకీయ పార్టీల వారీగా వేరుచేసి టీడీపీ బూత్‌కన్వీనర్లకు అనుసంధానం చేయడంలో అప్పట్లో చంద్రబాబు అండ్ కో .. ఎంతవరకు తమ కుట్రను కొనసాగించారు అంటే ఓటరుకు సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఫారమ్–7 అప్లై చేసుకునేలా యాప్‌ను డిజైన్ చేసుకున్నారు. ఆ ప్రకారంగానే వ్యూహాత్మకంగా వైయస్ఆర్‌సీపీ మద్ధతుదారుల ఓట్లన్నింటినీ అప్పట్లో తొలగించారని తెలియచేశారు. ఇలా దాదాపు 50 లక్షల ఓట్లను పైగా తొలగించారన్నారు.2019 ఎన్నికలకు ముందుగానే చంద్రబాబు కుట్రను గ్రహించి అప్పట్లో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘం దృష్టికి టీడీపీ ఓటర్ల జాబితా అవకతవకల్ని తీసుకెళ్లడం.. ఫలితంగా చంద్రబాబు కుట్రను ఛేదించడం జరిగిందన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని పిలవదగ్గ నాయకుడు. అలాంటి నీచమైన పనులు ఆయన చేయగలడు.. తన స్వార్థానికి ఎవరైతే అడ్డుగా ఉంటారో.. వారిపై కూడా అలాంటి ముద్రే వేయగలడు. కాబట్టే.. ఈరోజు ఓట్లర్ల జాబితాల్లో అవకతవకలంటూ వైయస్ఆర్‌సీపీ మీద నిందలేయడానికి చంద్రబాబు ఏమాత్రం సిగ్గుపడటంలేదు. గత కొంత కాలంగా మనం గమనించిన ప్రకారం దాదాపు పదిలక్షల ఓట్లకు సంబంధించి టిడిపి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు చేసిందన్నారు. చంద్రబాబు మాదిరిగా తప్పుడు విధానాలతో దొంగ ఓటర్లను ప్రయివేటు ఓటుబ్యాంకుగా డిపాజిట్ చేసుకోవాలనే ఆలోచన వైయస్ఆర్‌సీపీకి లేదు. వ్యవస్థల్ని ప్రలోభాలకు గురిచేయడం, ఓటర్లను మభ్యపెట్టడం, దొంగ ఓటర్లతో అధికారానికి అడ్డదారులేసుకోవడం అనేది చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య అని విమర్శించారు. శ్రీ వైయస్ జగన్ కు అశేష ప్రజాభిమానం మెండుగా ఉందని వారి హృదయాలను గెలుచుకోవడం,వారికి మేలు చేయడం ఆంధ్రప్రదేశ్ ను అభివృధ్ది పధంలోకి తీసుకురావడం ద్వారానే వారి మధ్దతును పొందుతారని అన్నారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు,ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకం కావాలి.వారి ఆదరణ పొందాలి. ప్రజల మెప్పుతో కూడిన తీర్పుతోనే ఎన్నికల పరీక్షలో పాసవ్వాలనేది వైయస్ జగన్ గారు పెట్టుకున్న లక్ష్యం. ఇందులో మరో మాటకు ఆస్కారమే లేదు. వైయస్ జగన్ లక్ష్యాలు, సిద్ధాంతాల పట్ల ప్రజల్లోనూ అదేవిధమైన అభిప్రాయం ఉందని వివరించారు. ఓటర్ల జాబితాపై నిర్వహించిన వర్క్ షాప్ లో తుమ్మల లోకేశ్వర రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు పలు అంశాలపై సందేహాలను నివృత్తి చేశారు. వర్క్ షాప్ లో రాష్ర్ట మంత్రి పినిసే విశ్వరూప్,శాసనమండలి లో ప్రభుత్వ విప్లే ళ్ళ అప్పిరెడ్డి, జేసీఎస్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ లు, తదితరులు పాల్గొన్నారు.