స్కూల్స్‌లో జరుగుతున్న అభివృద్ధి స్ఫూర్తిదాయకం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి:  పేద పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ప్ర‌భుత్వ‌ స్కూల్స్‌లో జరుగుతున్న అభివృద్ధి స్ఫూర్తిదాయకమని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. రాజకీయాల్లో, అధికారంలో ఎవరు ఉన్నా విద్యా, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. మాటల కంటే చేతలు ముఖ్యమని చెప్పారు. వైయ‌స్‌ జగన్ అంటేనే విద్యాలయాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నాడు- నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మంచి విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌దేనని అన్నారు. అమ్మఒడితో పిల్లల తల్లులకు ధైర్యం నింపారన్నారు. పేదరికంతో విద్యకు దూరం అవ్వకూడదు అని భావించే ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటూ ప్రస్తావించారు. మనం బాగుండటం కాదు ,మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలన్నారు. 

Back to Top