టీడీపీ చేసే అరాచకాలకు ఈనాడు వంత పాడుతోంది

టీడీపీ నేతలే అరాచకాలు సృష్టించి ప్రభుత్వంపై దుష్ప్రచారం  

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ప్రభుత్వం, పార్టీ ఎప్పుడూ మంచి పని చేసినా దాన్ని అడ్డుకునేందుకు కుట్రలు

మీడియా ద్వారా దేశాన్ని శాసించాలని రామోజీ భావిస్తున్నాడు

సాక్షి మీడియా వచ్చాకే రామోజీ ఆగడాలకు అడ్డుకట్ట పడింది

ప్రపంచాన్ని జయించిన  చక్రవర్తిలా రామోజీ ఫీల్‌ అవుతున్నాడు

ఈనాడు క్రెడిబిలిటీ ఎప్పుడో పోయింది

ఉగ్రవాద మనస్తత్వానికి నిదర్శనం ఈనాడు, ఆంధ్రజ్యోతి

ఎల్లోమీడియా టె్రరరిస్టులు తయారు చేసే వార్తలు ఆర్డీఎక్స్‌ కంటే ప్రమాదం

వ్యవస్థలను మేనేజ్‌ చేయడమే చంద్రబాబు, రామోజీల పని 

బూతులు నేర్పించి పట్టాభిని ఒక ఆంబోతులా ప్రజల మీదకు వదిలారు

బూతులు తిడుతూ అధికారులపై దాడులు చేస్తే కేసులు పెట్టొద్దా?

మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: టీడీపీ నేతలే అరాచకాలు సృష్టించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎల్లో మీడియా టెర్రరిస్టులు తయారు చేసే వార్తలు ఆర్డీఎక్స్‌ కంటే ప్రమాద‌క‌ర‌మ‌న్నారు. బూతులు తిడుతూ అధికారులపై దాడులు చేస్తే కేసులు పెట్టొద్దా? అని ప్ర‌శ్నించారు. మీడియా ద్వారా దేశాన్ని శాసించాలని రామోజీ భావిస్తున్నాడు. సాక్షి వచ్చాకే రామోజీ ఆగడాలకు అడ్డుకట్ట పడింద‌న్నారు. ఎన్టీఆర్‌ను గద్దెదించడంలో చంద్రబాబుకు రామోజీ సహకరించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడమే చంద్రబాబు, రామోజీలకు అల‌వాటు అన్నారు. వ్యక్తిత్వ హననం చేయడమే చంద్రబాబు, రామోజీల పని అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బూతులు నేర్పించి ఒక ఆంబోతులా పట్టాభిని ప్రజల మీదకు వదిలారు. బూతులు తిట్టడంలో పరీక్ష పెడితే పట్టాభికి డిస్టిక్షన్‌ వస్తుంద‌న్నారు. ఈనాడు తప్పుడు వార్తలపై తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. 

 • ప్రభుత్వం బీసీలకు ఎమ్మెల్సీ పదవులిస్తే అది ప్రజలకు తెలియకూడదని గన్నవరంలో గొడవలు సృష్టించారు. పట్టాభి నీ కొట్టారని ఈనాడు తప్పుడు వార్తలను ట్వీట్‌ చేసిన చంద్రబాబు, లోకేష్ చేశారు. తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రజల ఆలోచనలు ప్రభావితం చేయాలనే దృక్పథంతో వారే సూత్రదారులు, ఆ పరిస్థితులకు దారి తీసిన చర్యలకు తామే పాల్పడి..ఆ పరిస్థితికి ప్రభుత్వాన్ని బాధ్యతగా చేస్తూ..ఆ తరువాత రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఇంప్రేషన్‌ క్రియేట్‌ చేసేందుకు తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఇటీవల సీఎం వైయస్‌ జగన్‌ హిస్టారికల్‌ నిర్ణయం తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. బీసీలకు ఎమ్మెల్సీలకు ఇచ్చిన వాటా దేశమంతా చర్చ జరుగుతోంది. ఈ చర్చ జరుగకుండా ఉండేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ పాలన పరంగా తీసుకువస్తున్న విప్లవాత్మక చర్యలు, ఎన్నడూ కనీవిని ఎరుగని పథకాల నుంచి దృష్టి మళ్లించేందుకు, వాళ్లే అరా^è కాలు చేస్తూ..ఆ తరువాత క్రియేట్‌ అయ్యే ఘర్షణ వాతావరణం వస్తే ప్రభుత్వం కంట్రోల్‌ చేయడం లేదని శాంతిభద్రతలు లేవని కుట్రలు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో ఇదే కుట్రలు జరుగుతున్నాయి. ఈ మోతాదు మరింతగా పెంచారు. దీని పర్యావసనమే నిన్న, మొన్న గన్నవరం కేంద్రంగా జరుగుతున్న అరాచకాలు.
 • టీడీపీ స్ట్రచర్‌లోనే ఒక ఉగ్రవాద ఆలోచనలు ఉన్నాయి. ధర్మ యుద్ధానికి దూరం, రాజమార్గానికి దూరంగా, షార్ట్‌కట్‌లో అడ్డంగా పోవడమే వారి నినాదం. ప్రచారం చేసి కిందకు తీసుకెళ్లేందుకు వ్యవస్థలను మేనేజ్‌ చేయడం టీడీపీ ఆవిర్భావం నుంచి ఇదే జరుగుతుంది. 
 • ఈనాడు అనే పత్రిక వ్యవస్థ రాష్ట్రంలో బలంగా తయారు కావడం. ఆ పత్రిక అధిపతి రామోజీ రాజకీయాల్లోకి రావచ్చు..కానీ ఇన్‌డైరెక్ట్‌గా రిమోట్‌ కంట్రోల్‌ మాదిరిగా వ్వవస్థలను మేనేజ్‌ చేయవచ్చు అని భావించి మీడియాను అడ్డుపెట్టుకున్నారు. ఈనాడు రాష్ట్రానికి పట్టిన పీడ. టీడీపీ ఆవిర్భావం నుంచి రామోజీ పైత్యమంతా, ఆయన వికృత ఆలోచనలతో, బయట ప్రపంచంతో సంబంధం లేనట్లుగా దేశాన్నే కంట్రోల్‌ చేయాలనే విఫరీతమైన ధోరణీలో ఉన్నారు. అలాంటి వ్యక్తి చేతిలో ఉన్న ఈనాడు టీడీపీ ఆవిర్భావం నుంచి వికృతరూపంలోకి వెళ్లింది. ఇంగ్లీష్‌ నావల్‌ ఆల్‌మైటీ మాదిరిగా నేను చెప్పిందే వేదం, జరిగిందే శాసనం  అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. జనం నమ్ముతున్నారనే విఫరీతమైన దోరణిలోకి వెళ్లారు. దాని స్వరూరం ఎలా ఉంటుందని ఆలోచిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చూడవచ్చు. సాక్షి మీడియా వచ్చిన తరువాత నాణేనికి రెండో వైపు కనిపించడం జరిగింది. 
 • ఈనాడు కంటే విఫతమైన, పైశాచికమైన ఆలోచనలు ఉన్న చంద్రబాబు అనే పోటెన్షియల్‌ కాంబినేషన్‌ తయారైంది. రామోజీ చంద్రబాబుకు సహకరించి ఎన్టీఆర్‌ను గద్దె దించారు. అడ్డంగా చంద్రబాబు టీడీపీని లాక్కున్నారు. ఈ క్రమంలోనే చ ంద్రబాబుకు ఆయన పద్ధతిలోనే ఒకటి అర్థమైంది. ఏది చెప్పినా ప్రజలు అర్థం చేసుకుంటారు. మీడియా ద్వారా ఇలా వెళ్లవచ్చు అని చంద్రబాబు గ్రహించారు. అందుకే వరుసగా ఒక విధానం అన్నది లేకుండా ప్రత్యర్థులపై దాడి చేయడం, క్యారెక్టర్‌ అశాషినేషన్‌ చేయడం రామోజీ, చంద్రబాబుకు బాగా వంటపట్టింది. 
 • ఈ కాంబినేషన్‌ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంది. దీనికి తోడు ఆంధ్రజ్యోతి, టీవీ5 అనే విష పదార్థం కలిశాయి. వీళ్లకు తెలిసిన విద్యనే ప్రదర్శిస్తున్నారు.
 • రౌడీయిజం, వికృత ఆలోచనలకు మీడియా తోడైతే ఆర్డీఎక్స్‌ కంటే ప్రమాదకరంగా మారింది. ఏపీలో వీరు రోజు సవాలు విసురుతున్నారు. రాష్ట్ర విభజన, రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం ఇచ్చిన హామీలు వీరికి పట్టవు. ఎన్నికలు వస్తే ఇబ్బడి ముబ్బడిగా హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తరువాత చాప చుట్టి పక్కన పడేయడం, అధికారంలోకి రాకపోతే ప్రత్యర్థుల క్యారెక్టర్‌ అశాసినేషన్‌ చేయడం పనిగా పెట్టుకున్నారు. గొడవలు చేయడం, సృష్టించడం అంతా వాళ్లే.
 • వీళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయని గమనిస్తే..టీడీపీ శిక్షణా శిబిరంలో చంగల్‌రాయుడు మాట్లాడుతూ..ఎవరినైనా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తే జడ్జిల ముందు అబద్ధాలు చెప్పండి అని ట్రైనింగ్‌ ఇచ్చారు.  పోలీసులు కొట్టకపోయినా చెప్పరాని చోట కొట్టారని చెప్పండి అంటూ టీడీపీ నేతలకు శిక్షణ ఇచ్చారు.టీడీపీ అధ్యక్షుడి సమక్షంలో ఆ పార్టీ నేతలకు శిక్షణ ఇస్తున్నారు. వీటిలో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ను లాగి పదవీచ్యుతుడిని చేశాడు. ఇప్పుడు ఆయన ఫోటోకు దండేసి మా నాయకుడు ఎన్టీఆర్‌ అంటున్నాడు. జన్మభూమి కమిటీలు పెట్టి రౌడీలను ప్రోత్సహించారు.  ఎన్టీఆర్‌ పెట్టిన టీడీపీని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు.
 • నిన్న గన్నవరంలో ఏం జరిగిందంటే..అక్కడ పది రోజుల నుంచి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎమ్మెల్యే చంద్రబాబు, లోకేష్‌కు ఇక్కడికి వచ్చి పోటీ చేయమని వంశీ సవాలు విసిరారు. పట్టాభి అనే వ్యక్తి బూతులు తిట్టడంతో ఆయన్ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. ఈ పట్టాభి నేను వస్తానని సవాల్‌ విసిరి గన్నవరంలోకి Ðð ళ్లే అవసరం ఏముంది? ముఖ్యమంత్రిని బూతులు తిట్టారు. బూతులు తిట్టే పరీక్షల్లో పట్టాభికి డిస్ట్రేక్షన్‌ రావచ్చు. గన్నవరం వెళ్లి తిట్టి..మళ్లీ ఇక్కడికి వచ్చి తిట్టారు. ఈ క్రమంలో పోలీసు అధికారులపై దాడులు చేస్తే కేసులు పెట్టకుండా ఉంటారా? బాధితుడు సీఐ..ఆయన దెబ్బతిన్నాడు. అలాంటి వ్యక్తి ఎస్సీ కాదు..క్రిస్టియన్‌ అని కేసు పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు.
 • బూతులు మా జన్మ హక్కు అంటూ తిడుతూ..వీరంగం చేస్తే ఊరుకుంటారా? . గన్నవరం వెళ్లిన పట్టాభి తిట్టారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఊతక్రరలు ఉన్నాయి. సొంతంగా ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. ఇవాళ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నారు. ఇలాంటి పార్టీ నేతలు మీరు తిడుతుంటే ఊరుకుంటారా?. ఏ రోజైనా వైయస్‌ఆర్‌సీపీ రెచ్చగొట్టే ఘటనలు చేసింది? గన్నవరంలో పట్టాభి రెచ్చగొట్టడం, తిట్టడం, ఎదురెదురు పడటంతోనే గొడవ జరిగింది.
 • పట్టాభి అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు. చట్టప్రకారం కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండుకు పంపించారు. నిన్నటి నుంచి డ్రామా మొదలు పెట్టారు. ఆ తరువాత పట్టాభి బయటకు వచ్చి చేసిన నటన, ఈనాడు తప్పుడు కథనాలు, ఫోటోలు చూస్తే..కేవలం జనాన్ని పక్కదారి పట్టించి, అబద్ధాన్ని నిజమని మీడియా ద్వారా చూపించి చిల్లరగా వ్యవహరించడం నిన్న, ఇవాళ కనిపించింది. 
 • ఈ రోజు ఈనాడు పేపర్‌లో ఎప్పుడో పట్టాభి అనే వ్యక్తిని 2021లో కిందపడితే దెబ్బలు తగిలాయి. ఆ ఫోటోలు తెచ్చి ఈ రోజు ప్రచురించారు. ఈ రోజు జరిగినట్లుగా ఈనాడు వికృత విన్యాసం చేసింది. ఆ ఫోటోలు పాతవని తెలిసీ..తప్పు జరిగిందని చింతిస్తున్నామని ఖండన ఇచ్చారు.
 • తప్పుడు కథనాలు ఇవ్వడమే కాకుండా, జరగని విషయాన్ని జరిగినట్లు రెచ్చగొట్టి, ఆ తరువాత ఇళ్లు ఎక్కి కేకలు వేయడం వంటి విన్యాసాలు చూసి ఇలాంటి ఈనాడును బహిష్కరించాలా? వద్దా ప్రజలే నిర్ణయం తీసుకోవాలి.
 • నువ్వే తిట్టి..నువ్వే రెచ్చగొట్టి..నువ్వే సూత్రదారి, పాత్రదారివై నువ్వే బటయకు వస్తావు. ఈ మీడియా మరోరకంగా చూపిస్తుంది. నిన్న జరిగింది కూడా అంతే. అనపర్తిలో కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు.
 • జీవో నంబర్‌ 1 ఎందుకు తీసుకువచ్చిందో చంద్రబాబుకు తెలియదా? కందుకూరులో చిన్న సందులోకి జనాన్ని నెట్టి 8 మంది అమాయకుల ప్రాణాలు బలిగొనబట్టే కదా?. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు  ప్రభుత్వం జీవో నంబర్‌ 1 తీసుకువచ్చింది. లోకేష్‌ పాదయాత్ర ఎలాగు ఫెయిల్‌ అయ్యింది..ఇరుకు రోడ్డులో మీటింగ్‌ పెట్టి చంద్రబాబు రెచ్చిపోయాడు. జీవో నంబర్‌ 1 రావడానికి చంద్రబాబే బాధ్యుడు. బహిరంగ సభ జరుపుకునేందుకు స్థలం చూపించినా రోడ్డుపైనే సభ పెట్టుకుంటానని పోలీసులపై దురుసుగా మాట్లాడటం సరికాదు.
 • పోలీసులను ఇంతగా తిడుతున్న చంద్రబాబు..ఈ సిస్టమ్‌ నీకు ఎందుకు పట్టం కడుతుంది? ఆ వ్యవస్థ ఎందుకు నిన్ను గౌరవిస్తుంది. నువు ఈ పోలీసులతో కాకుండా ఏ పోలీసులతో ఉంటావు. 2014–2019లో ఈ పోలీసులే కదా ఉన్నారు. నీ హయాంలో వ్యవస్థలను చుట్టంలా వాడుకున్నావు. కొడెల శివప్రసాద్‌ సత్తెనపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయారు. గుంటూరు నుంచి ఎంపీటీసీలను తీసుకెళ్తుంటే అడ్డగించి కొట్టి ఎమ్మెల్యే ముస్తఫా, అంబటి రాంబాబుపై దాడి చేశారు. ఎంపీటీసీలను ఎత్తుకెళ్లి కేసు లేకుండా చేశారు. దౌర్జన్యం, దాష్టికం అంటే అది చంద్రబాబు. 
 • పట్ట పగలు చెరుకుపాడు నారాయణరెడ్డిని వెంటాడి చంపారు. ఎమ్మెల్యే హోదాలో రోజా మహిళా పార్లమెంట్‌ సమావేశంలో పాల్గొనేందుకు వస్తే అన్యాయంగా, అడ్డగోలుగా హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎలా హింసించారో అసెంబ్లీలో ఆయనే చెప్పారు. జలీల్‌ఖాన్‌ నీ గురించి ఇంకా బాగా చెబుతారు. జనసేన నాయకులు వైజాగ్‌లో మంత్రులపై దాడి చేశారు. 
 • మీ పాలనలో వైయస్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వస్తే ఎలా ఆపారో మరచిపోయారా? 67 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచిన వైయస్‌ఆర్‌సీపీ ఎలా వ్యవహరించిందో తెలియదా? వైయస్‌ జగన్‌ ఆ రోజు చట్టాన్ని గౌరవించి హైదరాబాద్‌ను వెనుతిరిగారు. మేం తలుచుకుంటే మీరు ఆపగలరా? దీక్షలు చేస్తే మీరు అడ్డుకుంటారా? ఈ రోజు లోకేష్, అనపర్తి, కుప్పంలో చంద్రబాబు లాగా మేం ఆ రోజు వ్యవహరించలేదే? పట్టాభిలాగా మేం డ్రామాలు ఆడలేదు కదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను అడ్డంగా వాడుకున్నారు. ఆ రోజు మేం విమర్శించామే కానీ, అడ్డగోలుగా బూతులు తిట్టలేదు. మా ఎమ్మెల్యేల్లో 23 మందిని సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తే మేం విమర్శించామే కానీ, ఎక్కడ బూతులు తిట్టలేదు. మీరే ఆ కొడుకు, ఈ కొడుకు అని తిట్టారు. మీలా మేం తిట్టలేదు. చిన్న లైన్‌ కూడా దాటలేదు. 
 • ఆ రోజు వైజాగ్‌లో వైయస్‌ జగన్‌ను ఆపితే మేం రియాక్ట్‌ అయితే వైజాగ్‌ మొత్తం కదిలేది. వైయస్‌ జగన్‌ అక్కడే కూర్చుంటామంటే రాష్ట్రం అంతా కదిలి వచ్చేది కదా? దీనికి పూర్తిగా విరుద్ధంగా చంద్రబాబు మనస్థత్వం ఉంటుంది. నువ్వే మర్డర్‌ చేస్తావ్‌..నువ్వే అడ్వకేట్, నువ్వే జడ్జివి..విక్టిమ్‌ రోల్‌ ప్రదర్శిస్తావు..ఇది చంద్రబాబు మనస్తత్వం. దీన్ని ప్రచారం చేయడానికి ఎల్లోమీడియా తోడుగా ఉంది. నటన కూడా అక్కర్లేదు..పాత ఫోటోలు ఉంటే చాలు విష ప్రచారం చేయవచ్చు అన్నది ఈ రోజు ఈనాడు పత్రికలో కథనమే నిదర్శనం. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీని నుంచి విముక్తి అంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేయడమే..ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ కాంబినేషన్‌ తెగిపోవాలంటే టీడీపీని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి. వీళ్లు మారరు. వీరిని మార్చలేం కూడా. ఇప్పటి వరకు జరిగిన ఘటనలకు పూర్తిగా కర్త, కర్మ, క్రియ అన్ని కూడా టీడీపీనే..గన్నవరం, అనపర్తి, కుప్పం ఘటనలకు తెలుగు దేశం పార్టీనే బాధ్యత వహించాలి. ప్రతిపక్షంగా ఏదైనా లోపాలు ఉంటే ఎత్తి చూపాలి కానీ, తిట్టడం, అడ్డగోలు భూతులతో రాజకీయాలు చేయడం దుర్మార్గం. 
 • నా కేరిర్‌ కూడా ఈనాడుతోనే మొదలైంది. అప్పటి నుంచి ఇలాంటి కుట్రలు చూస్తున్నాను. గతంలో స్కైలాబ్‌ అనేది పడితే ప్రపంచమంతా నాశనమవుతుందని ప్రచారం చేశారు. 30 కేజీలది పై నుంచి పడితే ప్రపంచం మునుగుతుందా?. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే ఒక పార్టీని అధికారంలోకి తీసుకువచ్చు అని గ్రహించి ఇలాంటి అడ్డగోలు ప్రచారం చేస్తున్నారు. కథలు అల్లగలరు. కథలు క్రియేట్‌ చేయగలరు, అసలు అవి కూడా అవసరం లేకుండా పాత ఫోటోలతో విషప్రచారం చేయడం వంటివి మొదలుపెట్టారు. ఈ ఆరాచకం, పవర్‌ఫుల్‌ మీడియాకు ఉగ్రవాద మనస్తత్వం ఏదైనా ఉంది అనుకుంటే అది ఏపీలో ఈనాడు, ఆంధ్రజ్యోతి అని చెప్పవచ్చు. 
 • పట్టాభి అనే వ్యక్తి విజయవాడ నుంచి గన్నవరం ఎందుకు వెళ్లాడు. అక్కడ పరిస్థితులు ఉదృతంగా తయారైతే బాధ్యులు ఎవరు? ఆ రోజు వైయస్‌ జగన్‌ను విశాఖలో ఎయిర్‌ పోర్టు నుంచి బయటకు రానివ్వకపోతే అందరికి కోపం వచ్చింది కానీ మేం ఎక్కడా కూడా గొడవలు చేయలేదు. వీళ్ల మాదిరిగా చేయలేదు కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆదరించి అధికారంలో కూర్చోబెట్టారు.
 • టీడీపీ పాలనలో ఏబీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వ్యవస్థను ఎలా వాడుకున్నారో అందరం చూశాం. వైజాగ్‌లో మా నాయకుడు వైయస్‌ జగన్‌పై కత్తితో దాడి చేస్తే..ఆ వెంటనే ఏబీ వెంకటేశ్వర్లు ఎలా స్టేట్‌మెంట్లు ఇచ్చారో చూశాం. మేం అధికారంలోకి వచ్చిన తరువాత చట్టపరంగా పని చేస్తూ, నిగ్రహంగా వ్యవహరిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
 •  
Back to Top