బీసీలకు సామాజిక న్యాయం చేసిన ఘనత వైయస్‌ జగన్‌దే

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు

బీసీలకు గుర్తింపు ఇచ్చిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీనే

ఆర్‌.కృష్ణయ్య లాంటి బీసీ నాయకుడిని రాజ్యసభకు పంపాం

 మూడున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ.1.70 లక్షల కోట్లు సీఎం అందించారు

విజయవాడ: బీసీలకు సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం బీసీలను ఏనాడు పట్టించుకోలేదని తెలిపారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మ గౌరవ సభలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

బీసీల ఆకాంక్షలకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీలకు ఒక గుర్తింపు ఇచ్చిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీనే. అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు.మూడున్నరేళ్ల కిందట రాష్ట్రం ఎలా ఉండేదో..సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి. విద్య, వైద్యమే ఏ కుటుంబానికైనా అతిముఖ్యం. 

వైయస్‌ఆర్‌సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్యకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవకాశం కల్పించారన్నారు. కృష్ణయ్య పార్లమెంట్‌లో కూర్చొని బీసీల సమస్యలపై మాట్లాడుతున్నారు. బీసీల ఆశలు, ఆకాంక్షలకు సంబంధించి వైయస్‌ఆర్‌సీపీ, వైయస్‌ జగన్‌ ఎంత పెద్ద పీట వేస్తుందన్న ప్రపంచమంతా అర్థం చేసుకోవాలి. ఆర్‌.కృష్ణయ్య లాంటి బీసీ నాయకుడిని రాజ్యసభకు పంపారంటే ..బీసీలకు వైయస్‌ జగన్‌ ఎంత చేస్తున్నారో ఇంత కంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. దీన్ని కృష్ణయ్య ఒక సర్టిఫికెట్‌లా భావిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఐదేళ్లు ప్రజలు ఇచ్చిన తీర్పును అవకాశంగా మార్చుకొని మళ్లీ ఐదేళ్ల తరువాత ఓటు అడుగుతారు. ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా సరే ఆశలు క్రియేట్‌ చేయడానికి, ఉన్న పాలనపై అపోహాలు కల్పించడానికి ప్రయత్నం సహజంగానే చేస్తారు.

ఏపీలో ఉన్న పరిస్థితి ఏంటంటే..ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించింది. మళ్లీ 2024 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ప్రజల ఆశీస్సులు కోరేందుకు సిద్ధమవుతున్నారు. మూడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తున్నారు. రేపు ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువగా తప్పుడు ప్రచారం చేస్తారు. రోజు వాళ్ల బాకా పత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టవచ్చు అని దుష్ప్రచారం చేస్తుంటారు. ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. పేదరికంలో ఉండి ప్రభుత్వ ఆసరాతో ఉన్న ప్రజలు కొంత కన్‌ఫ్యూజ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. మీలాంటి చైతన్యవంతులు అసలు వాస్తవాన్ని ప్రజలకు, మీ వర్గాలకు వివరించాల్సిన అవసరం ఉంది. మా పార్టీకి వచ్చిన అవకాశాన్ని వివరించాలి. మూడున్నరేళ్ల వరకు రాష్ట్రం ఎలా ఉండేది..ఇప్పుడు ఎలా ఉంటుందో గమనిస్తున్నారు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆ రోజు తన హయాంలో పరిమిత స్థాయిలో జాతీయ స్థాయి పార్టీలో ఉంటూ విద్యా, వైద్యానికి పెద్ద పీట వేశారు. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్‌ లాంటి పథకాలు సమాజానికి ఉపయోగపడ్డాయి. సాధికారత దిశగా అడుగులు వేయించారు. ఐదేళ్లలోనే యాభై ఏళ్లకు సరిపడ కీర్తిని ఘడించి దురదృష్టవశాత్తు వైయస్‌ఆర్‌ దూరమయ్యారు. ఆ తరువాత పాలకులు వైయస్‌ఆర్‌ చేసిన పాలనను ఉపయోగించుకుని ఉంటే బాగుండేది.  2014లో చంద్రబాబుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఆయన దిగిపోతు అప్పులభారాన్ని వైయస్‌ జగన్‌పై మోపారు. రాస్ట్రాన్ని  చంద్రబాబు అంధకారంలోకి నెట్టారు. వైయస్‌ జగన్‌ విప్లవాత్మక మార్పులతో సంస్కరణలు తీసుకువచ్చారు. ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా దీర్ఘకాలంగా ఉపయోగపడేలా, తన తలరాత తాను రాసుకునే వి«ధంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. రిజర్వ్‌ స్థానాలను కూడా బీసీలకు ఇచ్చి ఆదరించారు. కృష్ణా జిల్లాలో కూడా ఇదే కనిపిస్తుంది.

ఒక కుటుంబాన్ని చూస్తే ఉద్యోగాలు, సాధికారత, ఆర్థికం..వీటిని సమపాళ్లలో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నేరుగా డీబీటీ ద్వారా 1.75 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆ మేరకు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా వైయస్‌ జగన్‌ కల్పించారు. ఆర్థిక సాధికారతను అందించిన ఘనత వైయస్ జగన్‌ది.
మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే సీబీఎస్‌ఈ , ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదివించుకోమని సీఎం వైయస్‌ జగన్‌ భరోసా కల్పిస్తున్నారు. పోటీ ప్రపంచంలో ప్రభుత్వ స్కూల్‌ పిల్లలు పోటీ పడేలా సిస్టమ్‌ డెవలప్‌ చేస్తున్నారు. గతంలో లేని నమ్మకం ఈ రోజు తల్లిదండ్రుల్లో వచ్చిందంటే దానికి వైయస్‌ జగన్‌ చేపడుతున్న కార్యక్రమాలే నిదర్శనం.

వైద్యానికి సంబంధించి...రోజు రోజుకు రోగాలు పెరుగుతున్నాయి. వైయస్‌రాజశేఖరరెడ్డి హయాంలో 900 ప్రోసిజర్లు ఉండేవి. దాన్ని వైయస్‌ జగన్‌ 3,300 ప్రోసిజర్లకు  పైగా పెంచారు. హెల్త్‌ సెక్యూరిటీ కల్పిస్తున్న ప్రభుత్వం ఇది. ఆర్థిక స్థిమితం లేని వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైయస్‌ జగన్‌ భరోసా కల్పిస్తున్నారు. చికిత్స పొందిన తరువాత వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా అందిస్తున్నారు. ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా కాకుండా పేద ఇంట్లో జబ్బులబారిన పడితే కళ్లు మూసుకొని ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రిలో చేరితే కార్పొరేట్‌  వైద్యం అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. 
 

Back to Top