చేసిన పాపాలకు శిక్ష  అనుభవించాల్సిందే

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: చేసిన తప్పులు ఏదో ఒక సమయంలో వెంటాడతాయని చంద్రబాబు గారికి బాగా తెలుసు, చేసిన పాపాలకు శిక్ష  అనుభవించాల్సిందే అంటూ వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అధ్యక్షా! చిన్నమ్మా పురందేశ్వరి! హెరిటేజ్ డెయిరీకి ఐటీ నోటీసులొస్తే ప్రతి కంపెనీకి ఎప్పుడో ఒకసారి అలా రావడం సహజమే, సాధారణ నోటీసులే అనుకోవచ్చు. లంచం కింద కోట్లు చేరవేసిన బ్రోకర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇచ్చినవి సాధారణ నోటీసులు అవుతాయా? సాధారణ నోటీసు అయితే ఎప్పుడో పెనాల్టీ చెల్లించి బయటపడేవాడు. తప్పించుకోలేకనే తేలుకుట్టిన దొంగలా కిమ్మనలేక పోతున్నాడు.
సాక్ష్యాధారలు లేకుండా నేరాలు చేయడం, వెన్నుపోటు పొడవడం బాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. కానీ కాలం బలమైనది. వ్యవస్థలను జీవితాంతం మేనేజ్ చేయగలిగారు కానీ, ఇక మీకు శిక్ష అనుభవించే కాలం దగ్గర పడిందన్న తత్వం బోధపడినట్టుంది కదా! 

 చేసిన తప్పులు ఏదో ఒక సమయంలో వెంటాడతాయని చంద్రబాబు గారికి బాగా తెలుసు.  మీకే కాదు మీతోపాటు ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీకి కూడా శిక్ష తప్పదు. చేసిన పాపాలకు శిక్ష  అనుభవించాల్సిందే అంటూ విజ‌యసాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top